- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మీనాక్షి బిజీబిజీ.. పార్టీ వ్యవహారాలపై సొంత నెట్‌వర్క్‌తో ఫీడ్ బ్యాక్

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ పని తీరును తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా సెలైంట్‌గా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే నివాసముంటున్న ఆమె స్నేహితులు, మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆమెను స్టేట్ అఫైర్స్ ఇన్చార్జిగా నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన వెలువడిన మరుసటి రోజే తన స్నేహితులకు కాల్ చేసి రాష్ట్ర రాజకీయాలపై ఆరా తీసినట్లు తెలిసింది. దీని ఆధారంగానే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతల ప్రచారం సరిగా లేదని తెలుసుకుని, అందరూ క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని ఆదేశించినట్లు తెలిసింది. అంతేకాకుండా, ప్రభుత్వం పనితీరుపై బీజేపీ, బీఆర్ఎస్ చేస్తోన్న రాజకీయ విమర్శలపైనా ఆరా తీసినట్లు సమాచారం.
రోహిణ్ రెడ్డికి క్లాస్..
స్టేట్ కాంగ్రెస్ అఫైర్స్ ఇంచార్జ్ హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ఆమె అడుగుపెట్టిన వెంటనే పరిసరాల్లో కాంగ్రెస్ నేత రోహిణ్ రెడ్డి ఏర్పాటు చేసిన కటౌట్లను వీక్షించారు. అనంతరం గెస్ట్‌హౌజ్‌కు వచ్చాక టిఫిన్ చేస్తున్న సమయంలో ఫ్లెక్సీల అంశాన్ని స్టేట్ లెవల్ లీడర్స్ వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. కటౌట్లు వద్దని చెప్పినా ఎందుకు ఏర్పాటు చేయించారు.. ఆ ఖర్చును పేదలకు సాయం చేయొచ్చు కదా? మళ్లీ ఇలాంటి కటౌట్లు ఇంకోసారి తనకు కనిపించవద్దని అక్కడున్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు కటౌట్లు ఏర్పాటు చేయించిన రోహిణ్ రెడ్డికి క్లాస్ పీకినట్లుగా తెలిసింది.