- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజల మనసులు గెలిచిన మేడిపల్లి సత్యం.. ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి
దిశ డైనమిక్ బ్యూరో: విద్యార్హత లేకుండా కష్టపడకుండా డబ్బులు సంపాదించుకోవడానికి ఉన్న మార్గాల్లో రాజకీయం మొదటి స్థానంలో ఉందని.. అందుకే ఎలాంటి అర్హత లేని వాళ్ళు కూడా రాజకీయ నేతలుగా చలామణి అవుతున్నారని ప్రజల అభిప్రాయం. అయితే ఆ అభిప్రాయం తప్పని.. ప్రజా సేవ చెయ్యడానికి రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారని నిరూపించారు కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.
సాధారణంగా ప్రజా సేవ చేసే ఏ నాయకుడైన ప్రభుత్వ నిధులను ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తారు. ఏ నాయకుడు తన సొంత డబ్బులను ప్రజల కోసం వినియోగించడు. కానీ మనిషి ఏ స్థాయిలో ఉన్న తాను ఏ స్థాయి నుండి వచ్చారు అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు అంటారు. ఆ మాటని నిజం చేశారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. తాను కష్టపడి సంపాదించుకున్న జీతం రూ/ 1 ,50 ,000 ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థుల అల్పాహారం కోసం విరాంలంగా ఇచ్చారు.
నిరుపేద కుటుంబంలో పుట్టిన తాను ప్రభుత్వ హాస్టల్ ల్లో చదువుకుని.. పిహెచ్ డి పూర్తి చేసానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక తాను ఎమ్మెల్యేగా అందుకున్న మొదటి జీతాన్ని ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థుల అల్పాహారం కోసం ఇవ్వడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇటీవలే గంగాధర ప్రభుత్వ కళాశాల విద్యార్థుల అల్పాహారం కోసం మేడిపల్లి సత్యం రూ 30 వేలు అందచేశారు. భవిష్యత్తులో నిరుపేద విద్యార్థుల చదువు కోసం అండగా నిలబతాను అని మేడిపల్లి సత్యం పేర్కొన్నారు.