వర్షాలతో ఇబ్బంది పడుతున్న పేదలకు అండగా ఉంటాం: కార్పొరేటర్​ సబీహ బేగం

by Kalyani |
వర్షాలతో ఇబ్బంది పడుతున్న పేదలకు అండగా ఉంటాం: కార్పొరేటర్​ సబీహ బేగం
X

దిశ, కూకట్​పల్లి: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్థవ్యవస్థం అయిందని, రోజు కూలి పని చేసుకుంటూ, చిరు వ్యాపారాలు చేసుకుని జీవించే పేద ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారని అల్లాపూర్​ కార్పొరేటర్​ సబీహ బేగం అన్నారు. డివిజన్​ పరిధిలోని సఫ్దర్​నగర్​, రాజీవ్​గాంధీనగర్​, రామారావు నగర్​ కాలనీలలో శుక్రవారం కార్పొరేటర్​ సబీహ బేగం ప్రజలకు భోజనం అందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్​ సబీహ బేగం మాట్లాడుతూ.. డివిజన్​ పరిధిలో అత్యధికంగా పేద ప్రజలు నివాసం ఉంటున్నారని, ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు ఇబ్బందులు ఎదురుకోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఇంటి నుంచి బయటికి వచ్చేందుకు వీలు లేని పేద ప్రజలకు ఆహారాన్ని అందించే ఏర్పాట్లను చేపడుతున్నామని, కాలనీలలో ముంపు సమస్యను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు లింగాల ఐలయ్య, వీరారెడ్డి, నాగుల సత్యం, జ్ఞానేశ్వర్, సలీం, షేక్ రఫిక్, అస్లాం, సంజీవ, యోగి రాజు, అమీన్, సలీమ్​, నజ్మా, పర్వీన్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.


Next Story