ఆ పాఠశాలలో కనీస వసతులు కరువు.. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

by Kalyani |
ఆ పాఠశాలలో కనీస వసతులు కరువు.. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
X

దిశ, మేడిపల్లి: మేడిపల్లి మండలం పీర్జాదిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కనీస వసతులు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ దాదాపు 600 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. 9 మంది ఉపాధ్యాయులు హాజరవుతున్నారు. పరీక్ష కేంద్రం వద్ద కనీసం బాత్ రూంలు సరిగా లేవని, ఉన్న రెండు బాత్ రూంలలో వాటర్ రావడం లేదని పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఓ పక్క అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని చెపుతున్నారు, కానీ పీర్జాదిగూడ ఉన్నత పాఠశాలలో బాత్ రూంలు సరిగా లేక విద్యార్థినులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పరీక్ష కేంద్రాల వద్ద తగు ఏర్పాట్లు చేయాలని బాత్ రూంలలో వాటర్ వచ్చేటట్లు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed