- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జిల్లా వార్తలు > మేడ్చల్ > వరద సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం: కార్పొరేటర్ సబీహ బేగం
వరద సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం: కార్పొరేటర్ సబీహ బేగం
by Kalyani |

X
దిశ, కూకట్పల్లి: అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్‌నగర్, రాజీవ్‌గాంధీనగర్ కాలనీలలో కార్పొరేటర్ సబీహ బేగం శనివారం పర్యటించారు. ఎడతెరిపి కురుస్తున్న వర్షాలకు, వరద నీటికి కొట్టుకు వచ్చి కాలనీలలో పేరుకు పోయిన చెత్త చెదారాన్ని పారిశుధ్య విభాగం అధికారులతో కలిసి తొలగింపు చర్యలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సబీహ బేగం మాట్లాడుతూ వర్షాలకు ముంపు సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని, కాలనీలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, కాలనీలో పేరుకు పోయిన చెత్తను తొలగించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు లింగాల ఐలయ్య, జ్ఞానేశ్వర్, రియాజ్, ఆశు, రమేష్, బాబా, ముత్యాల దుర్గ, షమ తదితరులుపాల్గొన్నారు.
Next Story