నిస్వార్థ ప్రజాసేవకులకు గుర్తింపు ఉంటుంది

by Sridhar Babu |
నిస్వార్థ ప్రజాసేవకులకు గుర్తింపు  ఉంటుంది
X

దిశ, అల్వాల్ : నిస్వార్థ ప్రజాసేవకులకు చరిత్రలో గుర్తింపు ఉంటుందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం బీఎస్ వెంకట్రావు 126వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథితులుగా హాజరై ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ స్వార్థం లేకుండా ప్రజలకు సేవలు అందించిన వారికి ఎప్పటికీ చరిత్రలో గుర్తింపు ఉంటుందని తెలిపారు. వారి ఆశయ సాధనలో భాగంగా శాసనసభ్యులుగా తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. చెన్నూరు శాసన సభ్యులు వివేక్ మాట్లాడుతూ తమ తండ్రి గడ్డం వెంకటస్వామి పేదల కోసం జంట నగరాల్లో 80 వేల పైచిలుకు పేదలకు గుడిసెలు వేయించి ప్రభుత్వం ద్వారా పట్టాలు ఇప్పించారని గుర్తు చేశారు.

ఆధార్ సంస్థ మాజీ డైరెక్టర్ పీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలోనే హైదరాబాద్ అంబేద్కర్ గా పేరుపొందిన మహానాయకుడు బీఎస్ వెంకట్రావు అని తెలిపారు. అంబేద్కర్ కు అనుచరుడిగా ఆయన ఆశయ సాధనకు నిరంతరం కృషి చేసినట్టు పేర్కొన్నారు. సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ చైర్మన్ డాక్టర్ వెన్నెల గద్దర్ తెలిపారు. విద్యార్థుల కోసం హాస్టల్స్ ఏర్పాటు చేసి చదివించారని పేర్కొన్నారు. బీఎస్ వెంకట్రావు విగ్రహాన్ని తన తండ్రి గద్దర్ వెంకటాపురంలో ఏర్పాటు చేసేవరకు ఇక్కడి ప్రాంత వాసులకు ఆయన చరిత్ర తెలియదని గద్దర్ ఫౌండేషన్ వ్యవస్ధాపక కార్యదర్శి జీవి సూర్యకిరణ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిశోర్ గౌడ్, రావుల అంజయ్య, జాతీయ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సీఎల్ యాదగిరి, వినయ్ కుమార్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ బిట్ల వెంకటేశం, అల్వాల్ జేఏసీ నాయకులు సురేందర్ రెడ్డి, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, బీఎస్ వెంకట్రావు కుటుంబ సభ్యులు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డీబీ దేవానంద్, జాతీయ అంబేద్కర్ యువజన సంఘం కో ఆర్డినేటర్ ఎస్.వరుణ్ కుమార్, డాక్టర్ ఎస్.సిద్దోజిరావు, జర్నలిస్ట్ లు ఎడ్డ సంజీవ్, ఆస శ్రీరాములు పాల్గొన్నారు.

Advertisement

Next Story