రిటైర్మెంట్ హోమ్స్.. సీనియర్ సిటిజన్స్ కు వెరీ స్పెషల్

by Ramesh Goud |   ( Updated:2025-03-15 18:20:27.0  )
రిటైర్మెంట్ హోమ్స్.. సీనియర్ సిటిజన్స్ కు వెరీ స్పెషల్
X

దిశ, మేడ్చల్ బ్యూరో : రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త మార్పులొస్తున్నాయి. ప్రధానంగా గృహ నిర్మాణంలో అపార్ట్ మెంట్లు, విల్లాల నిర్మాణం ఎక్కువగా కనిపిస్తోంది. ఇందులో కొత్త విభాగాలు కూడా పుట్టుకొస్తున్నాయి. రియల్ రంగంలో పోటీ నేపథ్యంలో బిల్డర్లు వైవిధ్యంగా ఆలోచిస్తున్నారు. సృజానాత్మక ఉన్న వారు కొత్త మార్కెట్ల వైపు చూస్తున్నారు. అలాంటి వాటిలో ‘సీనియర్ లివింగ్ ’ఒకటి. వీటిని సరసమైన ధరలకే అందిస్తే మార్కెట్ వేగంగా వృద్ది చెందే అవకాశం ఉంది. మెట్రో నగరాల్లో ఇప్పటికే సీనియర్ లివింగ్ హోమ్స్ వచ్చాయని, హైదరాబాద్ నగరంలోనూ వీటికి మంచి భవిష్యత్తు ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

వయోధికుల కోసం..

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలే ఎక్కువగా ఉండేవి. తాతయ్యలు, తల్లిదండ్రులు, అత్త మామలు, పిల్లలు ఒకే ఇంట్లో నివసించేవారు. అప్పుడు వృద్దులను చూసుకోవాడానికి కుటుంబంలో చాలా మందే ఉండేవారు. కానీ ఇప్పుడు యువతరం వృత్తి, ఉద్యోగ రీత్యా వేరే నగరాలు, విదేశాలకు వెళ్తుతుండడంతో ఇక్కడ తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటున్నారు. జీవన ప్రమాణాలు పెరగడంతో పదవీ విరమణ తర్వాత జీవించే వయస్సు సైతం వృద్ధి చెందుతోంది. వృద్ధాప్యంలో మెరుగైన జీవితం కోసం పెద్దలను హైదరాబాద్ తీసుకువస్తున్నారు. ఒక వయస్సు వచ్చాక సాధారణ ఇళ్లలో నివసించడం పెద్దలకు అంత సౌకర్యంగా ఉండటంలేదు. వీటిని దృష్టిలో పెట్టుకునే సీనియర్ లివింగ్ విభాగం వచ్చింది.

మెట్రో నగరాల్లో బాగా ప్రాచుర్యం

బెంగుళూరు, ఢిల్లీ, ముంబయి లాంటి మెట్రో నగరాల్లో ఇలాంటి ఇళ్ల నిర్మాణం బాగా ప్రాచుర్యం పొందింది. మన దగ్గర రెండు, మూడు సంస్థలే తప్ప ఈ విభాగంలో ప్రాజెక్ట్ లు రాలేదు. సిటీలో వీటికి మున్మందు మంచి ఆదరణ ఉంటుందని అంచనా. పెద్దల అవసరాలు తీర్చేలా ముఖ్యంగా నర్సింగ్ సేవలు, కామన్ కిచెన్, పార్కులు, కాలక్షేపం కోసం సదుపాయాలు ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. బెంగుళూరు, ఢిల్లీ, ముంబాయి లో ఉన్నంతగా మన దగ్గర సీనియర్ లివింగ్ ప్రాజెక్ట్ లు లేవు. ఉన్నవి కూడా నగరం వెలుపలే ఉన్నాయి. విదేశాల్లో ఉంటున్న పిల్లలు తమ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని భావిస్తున్నారు. వృద్దుల జనాభా సైతం పెరుగుతోంది. మున్ముందు సీనియర్ లివింగ్ విభాగంలో ఎంతో డిమాండ్ ఉంటుంది. అదే సమయంలో సవాళ్లూ ఉన్నాయి. ఎలాంటి సౌకర్యాలు అక్కడ కల్పిస్తున్నారనేది ప్రధానం. తొలి నాళ్లలోపూర్తిగా పెద్ద వాల్ల కోసమే ఇళ్లు కాకుండా హైబ్రిడ్ తరహాలో చేస్తే మేలు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

డిమాండ్ పెరుగుతోంది

అగ్రశ్రేణి నగరాల్లో రిటైర్మెంట్ హోంలకు డిమాండ్ పెరుగుతోంది. భారత్ దేశంలో పదవీ విరమణ పొందిన జనాభా ప్రతి ఏటా పెరుగుతూ ఉంది. యునైటెడ్ నేషన్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్(యుఎన్డీఈఎస్ఏ) ప్రకారం, 2010లో 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల భారతీయుల సంఖ్య దాదాపు 91.6 మిలియన్లు. అదే 2025 లో ఈ సంఖ్య 158.7 మిలియన్లకు పెరగనుంది. గత దశాబ్ద కాలంగా అగ్రశ్రేణి నగరాల్లో రిటైర్మంట్ సొసైటీలు విపరీతంగా పెరిగేందుకు ఇదే కారణని రియల్ సంస్థలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నాయి.

Read More..

మొండి బకాయిల వసూలు వేగవంతం చేయాలి.. అడిషనల్ పీడీ

Next Story

Most Viewed