తెలంగాణ గార్డెన్స్​లో బహిరంగ సభను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే

by Sumithra |
తెలంగాణ గార్డెన్స్​లో బహిరంగ సభను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే
X

దిశ, కూకట్​పల్లి : కూకట్​పల్లి నియోజకవర్గం పరిధిలోని తెలంగాణ గార్డెన్స్​లో ఈ నెల 25న నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్సి నవీన్​ కుమార్​, నియోజకవర్గ కార్పొరేటర్​లు, డివిజన్​ల అధ్యక్షులు, ముఖ్యనాయకులతో టెలికాన్ఫరెన్స్​ నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఈనెల 25వ తేదిన ప్రతి ఒక్క డివిజన్​లో జెండా పండుగ సందర్భంగా జెండా పండుగను నిర్వహించి అక్కడి నుంచి తెలంగాణ గార్డెన్స్​లో జరుగుతున్న బహిరంగ సభకు తరలి రావాలని సూచించారు. ఎండల తీవ్రత ఎక్కువ ఉండటం కారణంగా కార్యకర్తలు ఇబ్బంది పడకుండా కార్పొరేటర్​లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, తాగునీటిని అందుబాటులో ఉంచాలని కోరారు.

Advertisement

Next Story