- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
welfare hostel :సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి..
దిశ, మేడ్చల్ బ్యూరో : మేడ్చల్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ కళాశాలలు, గురుకుల హాస్టల్స్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ అధ్యక్ష, కార్యదర్షులు సంతోష్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖల అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం పత్రికలకు ప్రకటన విడుదల చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ, కళాశాలాల, గురుకుల హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధికారులకు కోరారు. జిల్లాలో అద్దె భవనంలో హాస్టల్స్ బిల్డింగ్స్ నడుపుతూ, కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని దుస్థితి ఉందన్నారు.
కళాశాలలో హాస్టల్స్ విద్యార్థులకు కాస్మోటిక్, దుప్పట్లు, గిన్నెలు, గిలాసలు, కంప్యూటర్స్, ఆట వస్తువు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్కవార్డెన్ కి రెండు నుంచి మూడు హాస్టల్స్ ఇంచార్జ్ ఉన్నారని, ఖాళీగా ఉన్న వార్డెన్ వర్కర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 2023 మెస్ మెనూ కాకుండా, 2024 మెస్ మెనూ విడుదల చేయాలని, ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు హాస్టల్స్ విద్యార్థులకు దుప్పట్లు, యూనిఫామ్స్, స్పోర్ట్స్ యూనిఫామ్స్, నోట్ పుస్తకాలు వెంటనే ఇవ్వాలని వారు కోరారు. హాస్టళ్ల పై రెగ్యులర్ గా అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు శ్యామ్ రావు, నాయకులు సుబ్బు తదితరులు పాల్గొన్నారు.