- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ లిమిటెడ్ దౌర్జన్యం
దిశ, శామీర్ పేట్: ప్రజయ్ సిండికేట్ ఇంజనీర్స్ లిమిటెడ్ యాజమాన్యం ప్లాట్స్ కొనుగోలు చేసిన కొనుగోలుదారులను ఇబ్బంది పెడుతున్నారని కొనుగోలుదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. శామీర్ పేట్ మండల రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రజయ్ సిండికేట్ ఇంజనీర్స్ లిమిటెడ్ వారు చేసిన లేఔట్ లో 2016 సంవత్సరంలో అల్వాల్ కు చెందిన రాజేశ్వర్ రెడ్డి ప్లాట్ నెంబర్.560,561 లో 2002 గజాలు కొనుగోలు చేశామని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రజాయ్ యాజమాన్యం వారు కొనుగోలు దారులను అదనంగా మెయిన్ టేనెన్సు పేరిట 3 లక్షల రూపాయలు చెల్లించాలని, లేదంటే ప్లాట్ లో ఎలాంటి పనులు జరగనివ్వమని చెప్తున్నారని కొనుగోలు దారులు బోరుమంటున్నారు. ఎన్నిసార్లు సంస్థ కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. రెండు రోజుల క్రింద తమ ప్లాట్స్ లో ఉన్న చెట్లను బండలను తొలగించడానికి జేసీబీ తీసుకువస్తే ప్రజయ్ సంస్థ వారు 3 లక్షలు డబ్బులు కడితేనే పనులు జరగనిస్తాయనిదిగారని చెబుతున్నారు. అలాగే నెలకు 3 వేల రూపాయలు మెయిన్ టేనెన్సు పేరిట చెల్లించాలని చెబుతున్నారని అన్నారు. ప్రజయ్ సంస్థ యాజమాన్యం దగ్గర ప్లాట్లు కొనుగులు చేసిన కొంత మంది ని కూడా ఇలాగే ఇబ్బంది పెట్టారని చెప్పారు. ఇప్పటికైనా తమకి న్యాయం చేయాలని లేదంటే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ప్రజలు చెబుతున్నారు.