కాపుల మధ్య చిచ్చు పెడుతున్నారు : కాపు సంఘం నాయకులు

by Sumithra |
కాపుల మధ్య చిచ్చు పెడుతున్నారు : కాపు సంఘం నాయకులు
X

దిశ, పేట్ బషీరాబాద్ : కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ.వివేకానంద కాపుల మధ్య చిచ్చుపెట్టి విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని కుత్బుల్లాపూర్ కాపు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజులరామారంలో ఉన్న బీజేపీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సోమవారం కాపు సంఘం నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ జనసేనతో తెగతెంపులు చేసుకొని కేసీఆర్ కాళ్ళ వద్ద మోకరిల్లాడని ఆ సమయంలోనే ఆయనకు కాపుల మధ్య సంబంధం తెగిపోయిందని తెలిపారు. కాపు సంఘానికి భూమి ఇస్తానని మోసం చేసి మళ్లీ ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థిని ఉద్దేశించి విమర్శించారు. రాజకీయాల కోసం కాపుల మధ్య చిచ్చు పెడుతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కాపు కుల దేవుడు శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలను కూల్చినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ దే అని, బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన వాళ్లతో మాట్లాడించడం తప్పితే కాపులకు నువ్వేం చేసావో చెప్పాలని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో అడుగుపెట్టిన తరువాత వారు వన్ సైడ్ అయిపోయిందని, కాపుల మద్దతు బీజేపీ పార్టీకే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు సత్తి ఏసుబాబు, పుప్పాల మధు, పక్కల దుర్గారావు, సత్యనారాయణ, గోరిశెట్టి శ్రీనివాసరావు, పూర్ణ చంద్రరావు, కొట్టే రమణ, సత్యనారాయణరావు, ఏ సుబ్రహ్మణ్యం, నాగమనేంద్రరావు, రమేష్, బాలాజీ, వీరేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పమంటే భయం ఎందుకు..?

9 సంవత్సరాల కాలంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి చెప్పడానికి బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద ఎందుకు భయపడుతున్నారు అంటూ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ ప్రశ్నించారు. ఆదివారం యోగి ఆదిత్యనాథ్ రోడ్డు షోలో ఆయన ఈ విషయం పై గాజులరామారం చిత్తరమ్మ దేవి ఆలయం వద్ద ప్రమాణం చేసి చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ క్రమంలో శ్రీశైలం గౌడ్ చిత్రమాలయన్ వద్దకు వెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ.వివేకానంద కోసం ఎదురుచూసినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో మీడియా ద్వారా విమర్శలు చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న వివేకానంద నియోజకవర్గం, పేదలకు ఇండ్ల పట్టాలు రేషన్ కార్డులు సైతం ఇప్పించలేకపోయాడని అన్నారు. గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు నెరవేర్చకుండా కేవలం మాటలతో పప్పం గడిపాడని విమర్శించారు. చేసిన అవినీతి భూ కబ్జాల పై ప్రశ్నిస్తే ఓ టీవీ ఛానల్ వేదిక పై తన పై ఏకంగా దాడి చేశాడని, అభివృద్ధి పై ప్రశ్నిస్తుంటే ఎందుకు అంత కోపం వస్తుందని అన్నారు. ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం ఓట్ల ద్వారా చెబుతారని బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story