తల్లి, కూతురులు అదృశ్యం..

by Sumithra |
తల్లి, కూతురులు అదృశ్యం..
X

దిశ, మేడిపల్లి : తల్లి, ఇద్దరు కూతురులు అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పీఎన్టీ కాలనీ లో నివాసం ఉంటున్న డి .వెంకటేశ్వర్లు భార్య అయిన డి.ఈశ్వరమ్మ (37) సం.లు, ఈమెకు ఇద్దరు కుమార్తెలు, పెద్దమ్మాయి డి . పూర్వజ(19), రెండో అమ్మాయి హరిణి(18), తల్లి ఈశ్వరమ్మ తన ఇద్దరు కూతుర్లతో కలిసి ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళిపోయారు. తెలిసిన బంధువుల దగ్గర, ఎక్కడ వెతికినా ఆచూకీ లభించక పోవటంతో తండ్రి వెంకటేశ్వర్లు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. కేసు నమోదు చేసిన ఎస్సై సందీప్ కుమార్ దర్యాప్తు చేస్తున్నామని, వారి గురించి ఎటువంటి ఆధారాలు లభించిన మేడిపల్లి పోలీస్ వారికి లేదా 100 కు సమాచారం ఇవ్వాని తెలియజేశారు.

Advertisement

Next Story