మాదిగ భవన్ ఏర్పాటుకు కృషి చేస్తా : లక్ష్మారెడ్డి

by Sumithra |
మాదిగ భవన్ ఏర్పాటుకు కృషి చేస్తా : లక్ష్మారెడ్డి
X

దిశ, నాచారం : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాల వారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో తమ ఆత్మగౌరవ భవనాలు నిర్మించు కోవడానికి ప్రభుత్వం స్థలాలు, నిధులు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గ మాదిగ భవన్ ఏర్పాటు కోసం స్థలం కేటాయింపునకు కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. హబ్సిగూడ హోటల్ స్వాగత్ గ్రాండ్ లో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సండ్రపల్లి వెంకటయ్య సభఅధ్యక్షతన మాదిగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కోరిన విధంగా ఉప్పల్ భగాయత్ లో మాదిగ భవన్ ఏర్పాటు కోసం స్థలం కేటాయింపునకు ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి స్థల కేటాయింపునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ సామాజిక వర్గం సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు.

దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన దళితబందు పథకం అని, ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు పది లక్షల ఆర్థిక సహాయం అందజేయడం గొప్ప విషయం అన్నారు. నియోజకవర్గంలో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్నికల తర్వాత దళితబంధు పథకం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే మన జిల్లాలోని 12 ఎస్సీ సంక్షేమ వసతి గృహాల ద్వారా ఎంతో మంది పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారని లక్ష్మారెడ్డి తెలిపారు. అనంతరం నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ నాయకులు అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న, రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్, కోర్ కమిటీ మెంబర్స్ నాగారం బాబు మాదిగ, మంచాల యాదగిరి, కుమ్మరి సంఘం యాదగిరి, మాజీ కౌన్సిలర్ ముత్యాల నరసింహ, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు భాగ్యమ్మ, సెక్రటరీ బొల్లం జ్యోతి, మేడ్చల్ జిల్లా సెక్రటరీ వేముల హరిబాబు, గద్దల దుర్గయ్య, గొర్ల జగన్, మైలారం నాగేందర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed