- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గాజులరామారం సర్కిల్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు
దిశ, కుత్బుల్లాపూర్ : గాజులరామారం సర్కిల్ లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. సర్కిల్ లోని 4 డివిజన్ లలో ఈ తంతు రోజుకో చోట యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ 125 డివిజన్ గాజులరామారంలో బిల్డర్స్ బరితెగించి నిర్మాణాలు చేపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఓ వైపు హైడ్రా అధికారులు అక్రమార్కులకు దడ పుట్టేలా కూల్చివేతలు చేపడుతున్నప్పటికీ చట్టాలను మోసం చేస్తూ కొందరు బిల్డర్స్ అక్రమ నిర్మాణాలను ఎడా పెడా నిర్మించి సొమ్ము చేసుకుంటున్నారు.పేరుకు మాత్రమే కూకట్పల్లి జోనల్ కార్యాలయం నుండి కొంత వరకు పర్మిషన్ లు పొందినప్పటికి అనుమతులను మించి ఫ్లోర్స్ వేస్తూ సెట్ బ్యాక్ లు లేకుండా ఇల్లీగల్ గా భవంతులకు సెల్లార్ లు నిర్మిస్తూ జీహెచ్ఎంసీ వ్యవస్థకు మచ్చతెస్తున్నారు.
సెక్షన్ అధికారి వసూళ్ల దందా?....
గాజులరామారం డివిజన్ లో టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి వసూళ్ల దందాకు తెరలేపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమార్కులకు వెన్ను దన్నుగా నిలిచేందుకు గాను ఆ సెక్షన్ అధికారి అక్రమార్కులతో చేతులు కలుపుతూ ఒక్కో ఫ్లోర్ కి ఒక రేట్ ఫిక్స్ చేసి వసూళ్లకు దిగుతున్నట్లు సమాచారం. గాజులరామారంలోని మహాదేవ పురం, కైలాష్ హిల్స్, షిరిడీహిల్స్, దేవేందర్ నగర్, బాలాజీనగర్ మొదలగు కాలనీలలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి.
అక్రమ నిర్మాణాల పై స్థానికులు, కొందరు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేసినా వాటిపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేసేలా సెక్షన్ అధికారి దండిగా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. నోటీస్, షోకాస్ నోటీస్, టాస్క్ ఫోర్స్ కు నివేదించాం అనే మాటలతో ఫిర్యాదు దారులకు చుక్కలు చూపెడుతూ ఇక్కడి గాజులరామారం టౌన్ ప్లానింగ్ అధికారి మాయ మాటలతో మిస్మరైజ్ చేస్తూ వ్యవస్థలను మోసం చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
అక్రమ నిర్మాణాలతో జీహెచ్ఎంసీ ఆదాయానికి భారీగా గండి....
గాజులరామారం డివిజన్ లో నిర్మిస్తున్న చట్ట వ్యతిరేక నిర్మాణాలతో జీహెచ్ఎంసీ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. జీ+2 పర్మిషన్ తీసుకుని జీ +4,5 నిర్మాణాలను నిర్మిస్తుండడంతో జీహెచ్ఎంసీ ఆదాయానికి భారీగా గండి పడడంతో పాటు, అక్రమ సెల్లార్ నిర్మాణాలతో ఫైర్ ప్రమాదాలతో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా గాజులరామారం లో జరిగే అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.