గ్రేటర్​లోనే నెంబర్​ వన్ నియోజకవర్గంగా కూకట్​పల్లి: ఎమ్మెల్యే మాధవరం

by Kalyani |   ( Updated:2023-04-27 11:49:17.0  )
గ్రేటర్​లోనే నెంబర్​ వన్ నియోజకవర్గంగా కూకట్​పల్లి: ఎమ్మెల్యే మాధవరం
X

దిశ, కూకట్​పల్లి: గ్రేటర్​లోనే నెంబర్​ వన్​ నియోజకవర్గంగా కూకట్​పల్లిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక బద్దంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నియోజకవర్గం పరిధి ఫతేనగర్​ డివిజన్​ పరిధిలో రూ. 3.9 కోట్ల వ్యయంతో చేపడుతున్న నాలా రిటైనింగ్​ వాల్​ నిర్మాణ పనులను ఎమ్మెల్యే గురువారం స్థానిక కార్పొరేటర్​ పండాల సతీష్​ గౌడ్​తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్​పల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలలో ఎటువంటి రాజీ లేకుండా పని చేస్తున్నామని అన్నారు. రానున్న వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నాలా పరివాహక ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా, వరద సమస్యను పరిష్కరించేందుకు నాలా రిటైనింగ్​ వాల్​ నిర్మాణ పనులను చేపడుతున్నామని అన్నారు.

నియోజకవర్గం పరిధికి చెందిన ప్రతి డివిజన్​లోని ప్రతి కాలనీలో ప్రజలకు కనీస వసతులు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్​ నాయకత్వంలో అభివృద్ధియే ప్రధాన ఎజెండాగా పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ సత్యనారాయణ, డీఈ శ్రీదేవి, ఏఈ పవన్​, డివిజన్​ అధ్యక్షుడు కంచి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story