- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జేపీ హాస్పిటల్ అనుమతులు రద్దు..
దిశ, మేడిపల్లి : జేపీ హాస్పిటల్‌కు ఇచ్చిన నోటీసులకు వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో అనుమతులు రద్దు చేసినట్లు జిల్లా వైద్యాధికారి రఘునాథ్ స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. సీఈఏ చట్టం సెక్షన్ 12(1)(2) ప్రకారం, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టానికి విరుద్ధంగా ప్రెగ్నెన్సీ టర్మినేషన్లు నిర్వహించడం, అగ్ని భద్రత, సెవెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఫార్మసీ అనుమతులు వంటి వాటికి సంబంధించిన సరైన ధ్రువపత్రాలు పొందకపోవడం, అలానే పీసీపీఎన్ డీటీ చట్టం సెక్షన్ 23 ఉల్లంఘన, అనధికారికంగా ఆల్ట్రాసౌండ్, ఇతర వైద్య పరికరాలను ఉపయోగించడం, ఉద్యోగుల వైద్య అర్హతలు తప్పుగా చూపించడం వంటి చర్యలకు గాను మేడిపల్లి మండలం పీర్జాదిగూడలో గల జేపీ ఆస్పత్రికి గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆస్పత్రికి సంబంధించిన రిజిస్ట్రేషన్ 02-06- 2026 వరకు రద్దు చేసినట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.