- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రతీ రంగంలో మహిళా ముద్ర: మేయర్ నీలా గోపాల్ రెడ్డి
by S Gopi |

X
దిశ, కుత్బుల్లాపూర్: నేడు ప్రతీ రంగంలో మహిళా ముద్ర కనబడుతుందని నిజాంపేట్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకురాలు సబితా జలంధర్ రెడ్డి మేయర్ ను ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్ సబితా రెడ్డిని సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ చేసే పనిని కార్యదక్షత, చిత్త శుద్ధితో నిర్వహిస్తే ప్రతీ మహిళ పురుషుడితో సమాన హోదా పొందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంసీ బీఆర్ఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ రాము, 12 వ డివిజన్ ప్రచార కార్యదర్శి రమేష్, మనోహర్ రెడ్డి, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story