- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిర్మాపూర్ లో దర్జాగా అక్రమ దందా..
దిశ, మేడ్చల్ టౌన్ : మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని గిర్మాపూర్ లో అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పట్టపగలే అక్రమార్కులు దర్జాగా దందా సాగిస్తున్నారు. మల్లన్న గుడి వైపు ఉన్న సర్వేనెంబర్ 365 లోని ప్రభుత్వ భూమిలో నుంచి జేసీబీ, టిప్పర్లను వాడుతూ మట్టిని తరలిస్తున్నారు. ప్రతిరోజు వందలాది టిప్పర్ల మట్టిని స్థానికంగా ఉన్న వెంచర్ లోకి తరలిస్తున్నారు.
ఓ అధికార పార్టీ నేత ఈ తతంగానికి పాల్పడుతుండటంతో అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నారు. కాగా మరో ఆరోపణ కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఓ ఉన్నత పోలీస్ అధికారి రాయిలాపూర్ - గౌడవెల్లి దారిలో గోదాం నిర్మిస్తున్నాడని, ఆ గోదాంకు మట్టిని తరలిస్తున్నానని చెపుతూ ప్రైవేట్ వెంచర్ లోకి మట్టి తరలిస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై తహశీల్దారును వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.