ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా : ఈటల రాజేందర్

by Kalyani |
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా  : ఈటల రాజేందర్
X

దిశ, మల్కాజిగిరి ; ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని , ఎక్కడ అధర్మం అన్యాయం ఉంటుందో అక్కడే ఈటల రాజేందర్ పోరాటం ఉంటోందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం మల్కాజిగిరి నియోజకవర్గ కృతజ్ఞత సభలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. మల్కాజిగరి నియోజకవర్గంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయని, ఢిల్లీలో రైల్వే మంత్రి వద్ద మన సమస్యలు అన్నీ పెట్టి రైల్వే అధికారులతో చర్చిస్తానని, కంటోన్మెంట్ రోడ్ల గురించి రాజనాధ్ సింగ్‌ తోమాట్లాడి, కాలనీల వారీగా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తాను ఎంపీగా కాకుండా కార్పొరేటర్‌లా పని చేస్తానన్నారు. మల్కాజిగిరి ఎంపీ అంటే అందే ద్రాక్ష అనుకోవాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా పనులు చేస్తుంటే చూస్తూ ఊరుకోమన్నారు. వర్షాకాలంలో జీహెచ్‌ఎంసీ ఏమాత్రం బాధ్యత తీసుకోవడం లేదని విమర్శించారు. భారీ వర్షాలకు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయని, చెరువులలో గుర్రపు డెక్క పెరిగిపోతున్నా, కార్పొరేటర్ల నుండి జీహెచ్‌ఎంసీ మేయర్ వరకూ అందరూ బాధ్యత వహించాలన్నారు. పార్లమెంట్ నియోజక వర్గంలో నూటికి నూరుశాతం అన్ని అసెంబ్లీలలో బీజేపీని గెలిపించిన ఘనత మల్కాజిగిరి దేనన్నారు. గేటెడ్ కమ్యూనిటీలలో, కాలనీలలో ప్రజలు చైతన్యవంతంగా ఓట్లు వేసి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానన్నారు.

తనకు పదవి అనేది అలంకారం కాదనీ, రియల్ ఎస్టేట్ కోసమో, ఇతరుల మీద కేసులు పెట్టడానికో కాదనీ, ప్రజలకు సేవ చేయడానికి మాత్రమేనని, నమ్మన వ్యక్తినన్నారు. గొప్ప విజయం ఇచ్చినందుకు ఇది మీకే అంకితం చేస్తున్నానని ఈటల తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటు అధ్యక్షుడు మల్లారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ కన్వీనర్ ఆర్కే శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, డీఎన్ వెంకటేష్, మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్, వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, బాలింగం,వీకే మహేష్, వాసంశెట్టి శ్రీనివాస్, శ్రీనివాస్ ముదిరాజ్, నారహరి తేజ, పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed