- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూపర్ మ్యాక్స్ కంపెనీ కార్మికులకు అన్యాయం చేస్తే ఊరుకోం: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
దిశ, కుత్భుల్లాపూర్: ప్రైవేట్ కంపెనీలలో కార్మికులకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ హెచ్చరించారు. మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల బస్ డిపో ఎదురుగా గల సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని వారి డిమాండ్ల పరిష్కారం కోసం కంపెనీ ముందు కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు హాజరై, వారికి కూన శ్రీశైలం గౌడ్ తన సంఘీభావాన్ని తెలిపారు. జిల్లాకు చెందిన మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మ్యాక్స్ కంపెనీ కార్మికులకు అండగా ఉంటానని, కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల నేతలు ఐఎస్ రావు, లక్ష్మారెడ్డి, ఈశ్వర్ రావు, దయాకర్, సూర్యనారాయణ, రామచంద్ర రెడ్డి, సిద్ది రాములు, మధుకర్, జగదీశ్, రవీందర్, సురేష్, కంపెనీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.