- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇందిరా గాంధీ పట్టాలు ఇస్తే …రేవంత్ రెడ్డి కూలగొడుతుండు : ఈటల
దిశ,పేట్ బషీరాబాద్: దశాబ్దాల క్రితం కట్టుకున్న ఇండ్లకు కూడా హైడ్రా నోటీసులు ఇవ్వడం పై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. జొన్న బండ సర్వే నెంబర్ 582, 583 లో ఉన్న అదనపు భూమిని సత్యనారాయణ అనే వ్యక్తి అప్పట్లోనే ప్రభుత్వానికి ఇచ్చేశారని, ఇక్కడ ఉన్న పెద్ద కొండయ్య, చిన్న కొండయ్య లు ఆరు దశాబ్దాలుగా ఇక్కడే ఉన్నారని, వంద సంవత్సరాల క్రితం వారి కుటుంబ పూర్వీకులు ఇక్కడ వచ్చి స్థిరపడ్డారని, 72 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకున్న వారికి హైడ్రా నోటీసులు ఇచ్చిందని ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇది కేవలం ఒక ఉదాహరణ అని ఎంతోమందికి ఈ తరహాలో నోటీసులు ఇచ్చి మీ ఇల్లు కూల్చి వేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు.
ఇందిరాగాంధీ పట్టాలు ఇచ్చింది…కానీ…
దశాబ్దాలపాటు దేశాన్ని ఏలిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ పేదలకు ఇండ్లు కట్టుకుంటానికి పట్టాలి ఇచ్చిందని, వాటిలో పేదల ఇళ్లను నిర్మించుకొని తరాలుగా నివాసం ఉంటుంటే ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ఇళ్లను కూల్చివేస్తామంటూ చెప్పడం సమంజసమైన అంటూ ప్రశ్నించారు. ఇందిరా గాంధీ పట్టాలి ఇవ్వడం.. రేవంత్ రెడ్డి వాటిని కూల్చివేయడం చేయడం వంటి చర్యలు ఏమాత్రం ఆమోదించదగిన కాదని పేర్కొన్నారు. భూకబ్జాదారులకు, లాంటి మాఫియాలకు అండగా ఉంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు మాత్రం నిలువ నీడ లేకుండా చేస్తున్నారని, కనీస మానవత్వం లేకుండా హైడ్రా అధికారులను పంపించి ఇళ్లను కూలగొట్టే దుర్మార్గపు పనులకు పాల్పడుతుందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ నైజం బయటపడటానికి ఆరు సంవత్సరాలు పడితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లో రేవంత్ రెడ్డి బండారం కేవలం 6 నెలల కాలంలోనే బయటపడిందని, దీన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు.