- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పల్లెల్లో ఎన్నికల టెన్షన్

దిశ, మేడ్చల్ బ్యూరో : పంచాయతీ పోరుకు తెలంగాణ సై అంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. కానీ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇక్కడి పల్లెల్లో ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది. గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారా..? లేదా..? అన్న ఉత్కంఠకు తెరపడడం లేదు. దీంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.
34 గ్రామాలే..
జిల్లాలో గత పంచాయతీ ఎన్నికల్లో 61 గ్రామాలు, 5 మండలాలున్నాయి. ఈ గ్రామాల్లోంచి 28 గ్రామాలను గత ఏడాది సెప్టెంబర్ లో పక్కనున్న మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. ప్రస్తుతం 34 గ్రామపంచాయతీలే ఉన్నాయి. ఈ 34 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఒక పక్క ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే 34 గ్రామాలలో ఎన్నికలు నిర్వహించకుండా వాటిని కూడా మున్సిపాలిటీలు చేయాలని అధికారపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు ప్రభుత్వానికి లేఖ అందజేసినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. 34 గ్రామాలను పంచాయతీలుగానే కొనసాగించడం కంటే మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దిడమే మేలని అధికార పార్టీ నేతలు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది.
విలీన గ్రామాల్లో ఓటరు జాబితా రద్దు..
పురపాలికల్లో విలీనమైన గ్రామ పంచాయతీల ఓటరు జాబితాను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో 28 గ్రామాలు విలీనం అయ్యాయి. పంచాయతీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా గతేడాది సెప్టెంబర్ లో పంచాయతీలో వార్డుల వారీగా ఓటరు జాబితాలను ప్రకటించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పురపాలికల్లో విలీనమైన గ్రామాలకు గత నెల 4న రాష్ట్ర గెజిట్ లో ప్రకటించింది. సదరు పంచాయతీల ఉన్నతీకరణ కారణంగా పంచాయతీ రాజ్ చట్టం 2018లో సవరణ చేసి, ఆ శాఖ పరిధి నుంచి తొలగించారు. ఈ అంశాన్ని ఉదహరిస్తూ 28 విలీన గ్రామాల్లో ఓటరు జాబితాలు చెల్లవని ఎన్నికల సంఘం ప్రకటించడం గమనార్హం.