ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలి.. కలెక్టర్

by Sumithra |
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలి.. కలెక్టర్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు తాము చేస్తున్న బహిరంగ సభలు, ఎస్ఎంఎస్ ప్రచారాలను ఎన్నికల నిబంధనల ప్రకారం 48 గంటల వ్యవధిలో భాగంగా ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగించాలని తెలిపారు.

అదే విధంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం 72 గంటల వ్యవధిలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పై పూర్తి స్థాయిలో నిఘా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను ఉల్లంఘించినట్లయితే భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు.

Advertisement

Next Story