కాలుష్య కాసారంతో చేపలు విలవిల.. ఏటా క్షీణిస్తున్న మత్స్య సంపద

by Shiva |
కాలుష్య కాసారంతో చేపలు విలవిల.. ఏటా క్షీణిస్తున్న మత్స్య సంపద
X

దిశ, మేడ్చల్ బ్యూరో: చేపల పెంపకం ప్రశ్నార్థకంగా మారుతోం ది. చెరువులు సమీపంలోని పరిశ్రమల్లోని వ్యర్థాల వల్ల చేపలు విలవిలలాడుతున్నాయి. చెరువుల్లోకి పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్య నీటిని వదలడంతో చేపలు మృత్యు వాత పడుతున్నాయి. దీంతో మేడ్చ ల్ మల్కాజిగిరి జిల్లాలో చేపల పెం పకంపై ఆధారపడి జీవనం సాగిస్తు న్న మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేలాది కుటుంబాలు చేప ల పెంపకంతో పాటు చేపల విక్ర య కేంద్రాల ద్వారా ఉపాధి పొం దుతున్నారు.

చెరువుల పక్కనే పరిశ్రమలు

మేడ్చల్ జిల్లాలో 82 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, 65 ప్రాథమిక సహకర సంఘాలున్నాయి. వీటిలో 3738 మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. వీటితో 13 మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, 4 ఫిషర్మన్ మార్కె టింగ్ కోఆపరేటివ్ సంఘాలున్నాయి. వీరంతా చేపలు అమ్ముకోవడం.. రంగు చేపల ఉత్పత్తి, చేపల విక్రయ కేంద్రాల ద్వారా ఉపాధి పొందుతున్నారు. రాష్ట్ర సర్కార్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా మేడ్చల్ జిల్లాలోని 232 చెరువుల్లో చేపల పెంపకాన్ని చేపట్టారు. 100 శాతం సబ్సిడీతో ఆయా చెరువుల్లో 68 లక్షల 5 వేల చేప పిల్లలను పెంచుతున్నారు. ఇందులో 60 శాతం చెరువు లు పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమలకు దగ్గరగా ఉన్నాయి. వాటి నుంచి వచ్చే రసాయనాలు వ్యర్థ పదార్థాలు చెరువుల్లో కలిసి వేలాది చేపలు మృత్యు వాత పడుతున్నాయి.

కాలుష్య కారకాలు..

గొలుసు కట్టు చెరువులతో కలకలలాడిన మేడ్చల్ జిల్లాలో పట్టణీకరణ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో ఇక్కడి చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. కొన్ని చెరువులను ఆనుకొని పరిశ్రమలు ఏర్పాడ్డాయి. పరిశ్రమల కాలుష్య జలా లు, వ్యర్థ పదార్థాలను నేరుగా చెరువులోనే కలుపుతున్నారు. వాస్తవానికి వ్యర్థా లను చెరువులో కలిపే ముందు శుద్ధి చేయాల్సి ఉంటుంది. అందుకు ఒక్కో సారి శుద్ధి చేయడం ద్వారా రూ.2 లక్ష ల ఖర్చు అవుతోంది. దీంతో పలు పరిశ్రమల నిర్వహకులు అర్థరాత్రి వ్యర్థాలను తీసుకువచ్చి చెరువుల్లో కలిపేస్తున్నారు. దీనికి తోడు మెజారిటీ చెరువుల్లో గుర్ర పు డెక్క పెరుగుతోంది. గుర్రపు డెక్కను తొలగించినా.. ఒక్క రోజులోనే చెరువు అంతా ఆక్రమిస్తోంది. దీంతో చెరువులో ఆక్సిజన్ తగ్గుతోంది. ఆక్సిజన్ అందక చేపలు మృత్యువాత పడుతున్నాయి.

ఉదాహరణకు కొన్ని

జవహర్ నగర్ డంప్ యార్డు చేపల పెంపకానికి గుదిబండగా మారింది. ఆ డంప్ యార్డు నుంచి వస్తున్న కా లుష్య జలాలు సమీపంలోని చెరువు ల్లో కలుస్తున్నాయి. దీని ద్వారా చేప లు మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల ఘట్కేసర్ మండలంలోని ఎదుబాలాబాద్ గ్రామ పంచాయితీలోని లక్ష్మీ నారాయణ చెరువులో చేపలన్నీ మృత్యువాత పడ్డాయి. కుత్బుల్లాపూర్ మండలంలోని బాచు పల్లి చెరువులో పత్తికుంట చెరువు లో సమీపంలోని పరిశ్రమల నుంచి వచ్చి కలుస్తున్న కాలుష్య జలాల వల్ల వేలాది చేపలు మృత్యువాత పడ్డాయి. దీంతో జాతీయ ఫెడరేషన్ ఆఫ్ ఫిషరీస్ కో అపరేటివ్ లిమిటెడ్ చైర్మన్ చినంగి వెంకటేశ్ ముదిరా జ్, బాచుపల్లి మత్స్య శాఖ సహకార సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ 1వ తేదీ ప్రజావాణిలో చెప్పారు. శామీర్‌పేట, తుర్కపల్లి, దుండిగల్, ఫాక్ సాగర్ తదితర ప్రాంతాల్లో కొత్తగా నిర్మిస్తున్న అపార్టుమెం ట్లు, వాణిజ్య భవనాల వ్యర్థాలు, పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్య జలాలవల్ల సమీపంలోని చెరువుల్లో చనిపోయాయి.



Next Story