- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్....పీర్జాదిగూడలో రోడ్లకు మరమ్మతులు
దిశ, మేడిపల్లి : మేడిపల్లి-పర్వతాపూర్ రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ రోడ్ల దుస్థితిపై దిశ పత్రికలో వార్త ప్రచురితం కావడంతో కార్పొరేటర్లు స్పందించారు. పనులను కార్పొరేటర్లు సుభాష్ నాయక్, బండారి మంజుల రవీందర్ ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే...పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, పర్వతాపూర్ ప్రధాన రహదారి వరద కారణంగా గుంతలు పడి గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతుంది. ఈ నేపథ్యంలో శాశ్వత పరిష్కారం కోసం 2వ డివిజన్ కార్పొరేటర్ సుభాష్ నాయక్ ,15వ డివిజన్ కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్ స్పందించారు.
శనివారం వీజీ కాలనీ కమాన్ నుండి పంచవటి కాలనీ రోడ్ నెంబర్ 2 వరకు రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి.. ఈ సందర్భంగా కార్పొరేటర్ సుభాష్ నాయక్ మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తున్నామని, కొందరు అత్యుత్సాహంతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, వారికి ఈ రోడ్డు పనులు చెంప పెట్టులా మారతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండారి రవీందర్, జయేందర్, బలరాం, వీజీ కాలనీ అధ్యక్షులు ఆర్. పాపయ్య, సుకురు, సౌత్ పంచవటి కాలనీ అధ్యక్షులు నరసింహారావు, నాగేశ్వరరావు, పంచవటి కాలనీ మాజీ అధ్యక్షులు వరికుల శ్రీనివాస్, వివిధ కాలనీల నాయకులు పాల్గొన్నారు.