మంత్రి తలసాని నివాసం వద్ద ఆశావర్కర్లు అరెస్ట్

by Mahesh |   ( Updated:2023-08-29 06:21:16.0  )
మంత్రి తలసాని నివాసం వద్ద ఆశావర్కర్లు అరెస్ట్
X

దిశ, కంటోన్మెంట్/బోయిన్‌పల్లి: ఆశా వర్కర్ల జీతాలు పెంచాలంటూ మంత్రి తలసాని కి మెమోరాండం ఇచ్చేందుకు వచ్చిన ఆశావర్కర్లు. మంత్రి తలసాని లేడని అక్కడి సెక్యూరిటీ చెప్పడంతో వినకుండా తలసాని నివాసం వద్దకు వెళ్ళే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న మహిళా పోలీసులు ఆశా వర్కర్లను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Next Story