Task Force : చిన్నవారి పై కాటిన్యం.. పెద్దవారి పై కారుణ్యం..

by Sumithra |
Task Force : చిన్నవారి పై కాటిన్యం.. పెద్దవారి పై కారుణ్యం..
X

దిశ, పేట్ బషీరాబాద్ : 45 గజాల స్థలంలో నిర్మించిన స్లాబ్ నిర్మాణం కూలిపోయి కనిపిస్తున్న కట్టడం కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ విమానపురి కాలనీ లోనిది. ఫిర్యాదుల మేరకు స్పందించిన జిహెచ్ఎంసి టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం ఈ కట్టడాన్ని కూల్చివేశారు. దీనికోసం జీహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ అధికారినితో పాటుగా ఆమె అసిస్టెంట్, కుత్బుల్లాపూర్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారినితో పాటుగా ఆమె అసిస్టెంట్, 15 మంది సిబ్బంది, రెండు ట్రాక్టర్ కాంక్రీట్ బ్రేకర్ వాహనాలు, గ్యాస్ కట్టర్, సిబ్బంది రావటానికి మరొక వాహనంలో తరలివచ్చి 45 గజాల స్థలంలో నిర్మించిన రెండు గదుల స్లాబ్ నిర్మాణాన్ని నేలకూల్చి కాంక్రీట్ బ్రేకర్ లతో పగలగొట్టి, గ్యాస్ కటింగ్ యంత్రంతో కట్ చేసి పూర్తిగా నేలమట్టం చేశారు. అనంతరం సదర నిర్మాణాన్ని ఫోటోలు తీసుకొని అక్రమ నిర్మాణాల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం అన్నట్లుగా వ్యవహరించారు అధికారులు. అయితే ఫిర్యాదులకు స్పందించి 45 గజాల స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణం పై అధికారుల తీరును అభినందిస్తూనే, మరి ఎందుకు పెద్దపెద్ద నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చిన స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు పౌరులు.

చిన్నవారి పైన మాత్రమే ప్రతాపమా..?

అక్రమ నిర్మాణాల పై టాస్క్ఫోర్స్ అధికారుల పనితీరును ఒకవైపు అభినందిస్తున్న వారి మరోవైపు వారి వ్యవహార తీరు పై తప్పుబడుతున్నారు. చిన్నచిన్న అక్రమ నిర్మాణాల పై బాధ్యతాయుతంగా వ్యవహరించిన టాస్క్ఫోర్స్ అధికారులు అదేవిధంగా నిబద్దతతో పెద్ద పెద్ద సంస్థలు, బడాబడా నిర్మాణదారులు చేపడుతున్న అక్రమ నిర్మాణాల పై సైతం ఇదే విధంగా కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రాయి చాందిని కనిపించడం లేదా..

పేట్ బషీరాబాద్ లో రాయి చాందిని షాపింగ్ మాల్ పై అక్రమంగా ఒక భారీ షెడ్ ను నిర్మించారు. ఈ కట్టడం పై ఏప్రిల్, మే నెలలోనే రెండు నోటీసులు ఇచ్చారని సర్కిల్ అధికారులు తెలిపారు. అయితే నేటి వరకు రాయి చాందిని షాపింగ్ మాల్ పై అక్రమంగా నిర్మించిన షెడ్యూలు మాత్రం అధికారులు తొలగించలేదు. చిన్న చిన్న నిర్మాణాలు, షెడ్లను వేసుకున్న వారి పై మాత్రం టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రతాపం చూపిస్తున్నారు. కానీ రాయి చాందిని వంటి బడా సంస్థలకు చెందిన అక్రమ నిర్మాణాల పై మాత్రం వారు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్నచిన్న అక్రమ నిర్మాణాలు కనిపిస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందికి రాయి చాందిని నిర్మించిన అక్రమ కట్టడం కనిపించకపోవడం పై పలు రకాల మాటలు వినిపిస్తున్నాయి.

ఫిర్యాదులు వచ్చిన, నోటీసులు ఇచ్చిన అక్రమ నిర్మాణాలలో కొన్ని..

పెట్ బషీరాబాద్ రాయి చాందిని షాపింగ్ మాల్ పై అక్రమ షెడ్డు నిర్మాణం.

రంగారెడ్డి నగర్ డివిజన్ ఏపీహెచ్బి కాలనీ కమాన్ సమీపంలో ప్రధాన రహదారిలో 100 గజాలు విస్తీర్ణంలో ఉన్న రెండు ప్లాట్ లలో సెల్లార్ నిర్మాణంతో పాటుగా అదనపు అంతస్తులు నిర్మాణం.

సుభాష్ నగర్ లాస్ట్ బస్సు స్టాప్ సమీపంలో ఓ వ్యక్తి రోడ్డు ఆక్రమించి భవన నిర్మాణం చేపడుతున్నాడని జీహెచ్ఎంసీలో ఇప్పటికీ స్థానికులు రెండుసార్లు ఫిర్యాదులు చేశారు.

రంగారెడ్డి నగర్ డివిజన్ చెన్నారెడ్డి నగర్ లో ఓ వ్యక్తి జీ ప్లస్ టు అనుమతులు తీసుకొని జీ ప్లస్ ఫ్లోర్ తో పాటుగా ఇరువైపులా ఉన్న రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టాడు.

కుత్బుల్లాపూర్ జయరాం నగర్ ప్రధాన రహదారిలో ఓ వ్యక్తి సెల్లార్ నిర్మాణంతో పాటుగా అంతస్తులు నిర్మిస్తున్నాడు.

పెట్ బషీరాబాద్ డీ మార్ట్ సమీపంలో మూడు భవనాలు అక్రమ సెల్లార్ నిర్మాణంతో పాటుగా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు.

కుత్బుల్లాపూర్ డివిజన్ డీ నగర్, శ్రీనివాస్ నగర్ కాలనీలో అనుమతులు ఒక రకంగా తీసుకొని అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు.

Advertisement

Next Story