మహిళలు విద్యతోనే అన్ని విధాల అభివృద్ధి చెందుతారు

by Naresh |
మహిళలు విద్యతోనే అన్ని విధాల అభివృద్ధి చెందుతారు
X

దిశ, సంగారెడ్డి: మహిళల విద్యతోనే అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. లింగ వివక్షత లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు పూనుకోవాలన్నారు. ఇంటి నుంచే మార్పు ప్రారంభం కావాలని, మగపిల్లలు,ఆడపిల్లలని వేరువేరుగా చూడకుండా ఇద్దరినీ సమానంగా చూడాలన్నారు.

ముఖ్యంగా పిల్లల్లో మార్పు తీసుకు రావాలన్నారు. సమాజంలో పూర్తిస్థాయిలో లింగ వివక్షత రూపు మాపాలని, అప్పుడే నవ సమాజానికి నాంది పలుకుతుందన్నారు. మహిళలు తలచుకుంటే ఏదైనా అవలీలగా చేయగలరని, అన్ని రంగాల్లో రాణిస్తూ ముందుకు దూసుకు వెళ్తున్నారన్నారని అభినందించారు. మహిళలు విద్య, వైద్యం, వ్యాపార, రాజకీయంగా, ఇతర అన్ని రంగాల్లో అన్నింటా ముందుండి ఉన్నతంగా రాణించాలన్నారు. అమ్మాయిలు తాము ఎంచుకున్న రంగంలో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న మహిళా అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ పద్మజ రాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి, డీఎంఅండ్ఎచ్ఓ గాయత్రీ దేవి, మెప్మా పీడీ గీత, పట్టణ టౌన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, సీడీపీవో లు, అంగన్వాడీ మహిళా ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story