ఎల్‌ఆర్‌ఎస్‌తో ప్రజలపై రూ. 22 వేల కోట్ల భారం

by Naresh |
ఎల్‌ఆర్‌ఎస్‌తో ప్రజలపై రూ. 22 వేల కోట్ల భారం
X

దిశ, నర్సాపూర్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్‌ను ఉచితంగా అమలు చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎల్ ఆర్‌ఎస్‌ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం ప్రజలపై రూ. 22 వేల కోట్ల భారాన్ని మోపుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయకుండా మాట తప్పి ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. ఎల్ ఆర్ ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న 25 లక్షల 44 వేల మందికి ఉచితంగా ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజలపై భారము మోపి ఖజానా నింపుకోవడానికే తీసుకొచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని డిక్లరేషన్ లను వెంటనే అమలు చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ నహీం, మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్, నాయకులుసంతోష్, చంద్ర గౌడ్, మన్సూర్, దొంతి సంతోష్ రెడ్డి సుధాకర్ రెడ్డి, సత్యం గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed