- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎంపీగా ఉండి చేయనిది.. ఎమ్మెల్యేగా ఏం చేస్తావ్ : టీపీసీసీ ఉపాధ్యక్షుడు

దిశ, దుబ్బాక: బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి అమలు చేయ లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం భూంపల్లి అక్బర్ పేట మండలంలో బైక్ ర్యాలీ, ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా ఉన్నవారికే బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్లు ఇస్తున్నారన్నారు. బీసీ బంధు, దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్‌లతో ప్రజలను పక్క దారి పట్టిస్తున్నాయన్నారు. ఇక్కడి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే భూంపల్లి మండలంలో ఎంతమందికి దళిత బంధు, బీసీ బంధు అందించారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని పేర్కొన్నారు. భూంపల్లి మండలంలో ఎంతమంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించారో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పాలన్నారు. దుబ్బాకలో కేసీఆర్, హరీష్ రావుకు చెప్పు చేతల్లో ఉండే వ్యక్తి, గేటు దగ్గర కాపాల ఉండే కొత్త ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చారన్నారు.
కొత్త ప్రభాకర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే 9 ఏండ్లు ఎంపీగా ఉండి సిద్దిపేట, గజ్వేల్ తరహాలో భూంపల్లి ఎందుకు అభివృద్ధి కాలేదని ఆయన ప్రశ్నించారు. ఎంపీగా ఏం చేయనిది ఎమ్మెల్యే గా వచ్చి ప్రభాకర్ రెడ్డి చేసేది ఏమి లేదన్నారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించాలని కోరారు. దుబ్బాక అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, బైక్ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అందే రాజిరెడ్డి, కమలాకర్, భూపాల్ గౌడ్, బ్యాగరి నవీన్, కనుక రెడ్డి, కిషోర్, పర్షరాములు, దుబ్బాక నర్సింలు, శ్రీకాంత్, దేవర మహిపాల్ , మహేష్ తదితరులున్నారు.