- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంక్షేమం, అభివృద్ధి బీఆర్ఎస్ ప్రగతికి చిహ్నాలు : ఎమ్మెల్యే సతీష్ కుమార్
దిశ, హుస్నాబాద్: అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ పార్టీ ప్రగతికి చిహ్నాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని పోతారం (ఎస్) శుభం గార్డెన్ లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలో ఎమ్మెల్యే పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి సభలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయన్నారు. అధిష్టానం పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపి మరింత పటిష్ట పరిచేందుకు ప్రతినిధుల సభ నిర్వహించామన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేశామన్నారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రాజెక్టులో నీళ్లు నింపి హుస్నాబాద్ ప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తామన్నారు. ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ ఆరాటపడుతోందని భవిష్యత్తులో కాంగ్రెస్ కనుమరుగవడం ఖాయమని తెలిపారు. అలాగే మతం పేరుతో బీజేపీ చౌకబారు రాజకీయాలు చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తుందన్నారు. ఈ రెండు పార్టీలను కాలగర్భంలో కలిపి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని.. ఇందు కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.