- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోదీ సర్కారు తీరుపై ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి: చాడ వెంకట్ రెడ్డి
దిశ, హుస్నాబాద్: దేశ ప్రజలను మోసం చేస్తున్న మోదీ సర్కారు తీరుపై ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని అనుభేరి సింగిరెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బ్రిటీష్ వలస పాలన 1920 సంవత్సరంలో కార్మికులు భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించారని అన్నారు. ఇటీవల సీపీఐకి జాతీయ హోదా పోతే కిరీటాలు ఏమి పోవని ఇంకా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.
ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడానికి ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థలతో దాడులు చేయించి కేంద్ర ప్రభుత్వం దుష్ట సంస్కృతిని చాటుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నేర చరిత్ర కలిగిన రాజకీయ నాయకులు ఉండడం ప్రజాస్వామ్యానికే తలవంపులు అని అన్నారు. ఈనెల 16 నుంచి 30 వరకు జరిగే పల్లెపల్లెకూ సీపీఐ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపే మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.