ప్రత్యేక రాష్ట్రంతోనే విద్యుత్‌ ప్రగతి : జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి

by Shiva |
ప్రత్యేక రాష్ట్రంతోనే విద్యుత్‌ ప్రగతి : జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి
X

అందోలులో రూ.239.15 కోట్లతో విద్యుత్‌ అభివృద్ధి : ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌

దిశ, అందోల్ : సీఎం కేసీఆర్‌ పాలనలోనే విద్యుత్‌ ప్రగతి సాధ్యమైందని, ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్‌ సంస్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా అందోలులోని లక్ష్మినర్సింహ గార్డెన్‌లో నిర్వహించిన విద్యుత్‌ ప్రగతి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హజరై ప్రసంగించారు. గత ప్రభుత్వాల హాయాంలో విద్యుత్‌ కొతలు విపరీతంగా ఉండేవని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు.

నా చిన్నతనంలో విద్యుత్‌ కోతల కారణంగా అనేక సందర్బాలలో దీపం వెలుగులో చదువుకున్నానని ఆమె గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విద్యుత్‌ వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా విద్యుత్‌ను వాడుకుంటున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ మాట్లాడుతూ కరెంట్‌ తీగలపై బట్టలు అరబెట్టుకునే పరిస్థితి తెలంగాణకు వస్తుందని అప్పట్లో సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారని, ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్‌ ప్రగతిని చూసి సీఎం కేసీఆర్‌ను ప్రశంసిస్తున్నారన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉచిత విద్యుత్‌ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కుతుందన్నారు. ఎస్‌సీ, ఎస్‌టీల గహా అవసరాలకు 101 యూనిట్‌ల వరకు, సెలూన్‌లకు, లాండ్రీలకు, దోబిఘాట్లకు 250 యూనిట్‌ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నామన్నారు. గత పాలకులు చేపట్టిన పనులతో ప్రజలకు ఏమి ఉపయోగపడిందో చెప్పాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అందోలు నియోజకవర్గంలో విద్యుత్‌ సరఫరా అభివద్ది కోసం రూ.239.15 కోట్లను ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు.

నియోజకవర్గంలో గతంలో 66,344 మంది వినియోగదారులుండగా, ప్రస్తుతం 1,06,551 మంది వినియోగదారులకు విద్యుత్‌ కనెక్షన్‌లకు పెరిగాయన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ వైస్‌ చైర్మన్‌ పి.జైపాల్‌రెడ్డి, నియోజకవర్గ స్పెషల్‌ ఆఫీసర్‌ ఎల్లయ్య, డీఈ ఏ.శ్రీనివాస్, ఏడీఏ టీ.శ్రీనివాస్‌రావు, ఎంపీపీ బాలయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, మాజీ ఎఎంసీ చైర్మన్‌ పి.నారాయణ, ఏఈలు శ్రీనివాస్, దుర్గయ్య, వైస్‌ఎంపీపీ మహేశ్వర్‌రెడ్డి, సంగారెడ్డి కరెంట్‌ ఎస్‌ఏవో ప్రభు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ డెవిడ్, స్పెషల్‌ ఆఫీసర్‌ గీత, ఎంపీడీవో సత్యనారాయణ, తహశీల్దార్‌ వెంకటేశంతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story