- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
crime : నర్సాపూర్ పట్టణంలో విషాదం…డెంగ్యూతో ఏడేండ్ల బాలిక మృతి
by Kalyani |
X
దిశ, నర్సాపూర్ : డెంగ్యూ వ్యాధి సోకి ఏడేళ్ల బాలిక మృతి చెందిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే నర్సాపూర్ పట్టణంలోని శివాలయం వీధికి చెందిన జింకల నర్సింగ్, లహరి కూతురు సహస్ర (7) గత మూడు రోజుల క్రితం జ్వరం సోకి అనారోగ్యానికి గురైంది. గమనించిన తల్లిదండ్రులు నర్సాపూర్ పట్టణంలోని పలు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మెరుగు పడకపోవడంతో రక్త కణాలు తగ్గి పరిస్థితి విషమించింది. దీంతో ఉన్నత చికిత్స కోసం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా పాప పరిస్థితి విషమించిందని డాక్టర్లు చేతులెత్తేయడంతో మార్గ మధ్యలో చిన్నారి సహస్ర మృతి చెందినట్లు కాలనీ వాసులు తెలిపారు. నర్సాపూర్ పట్టణంలోని డాన్ బాస్కో హై స్కూల్ లో ఒకటవ తరగతి చదువుతున్న సహస్ర మృతి చెందడంతో నర్సాపూర్ పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Next Story