బీఆర్ఎస్ అన్యాయాలకు నేటితో తెర....

by Naresh |   ( Updated:2024-03-06 12:48:56.0  )
బీఆర్ఎస్ అన్యాయాలకు నేటితో తెర....
X

దిశ, తూప్రాన్: బీఆర్ఎస్ పదేండ్ల అవినీతి పాలనకు నేటితో తెర పడిందని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గిన తర్వాత తూప్రాన్‌లో భారీ ర్యాలీ తీసిన ఆయన స్థానిక నాయకులు కౌన్సిలర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైర్మన్‌గా ఎన్నికయినప్పటి నుంచి మాజీ మంత్రి హరీష్ అండదండలతో ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఎన్నో అన్యాయాలకు అక్రమాలకు పాల్పడ్డారని నేటితో అక్రమార్కుల పాలన ముగిసిందని అన్నారు. గత సంవత్సరాల్లో ఎన్నో సార్లు మంత్రి దృష్టికి ఆయన అక్రమాలను తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది అని వైస్ చైర్మన్ ప్రస్తుతం అపదర్మ చైర్మన్ నందలా శ్రీనివాస్ తోటి కౌన్సిలర్స్ అవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి మిగతా నాయకుల సహకారంతో అవినీతి చైర్మన్ ను గద్దె దించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు ఉద్యమ నాయకులు మాట్లాడుతూ… ఇన్నాళ్ళ పాపాలకు ఉద్యమ కారుల ఉసురు ముట్టిందని ఇకపై తూప్రాన్ ప్రజలు సంతోషంగా ఉంటారని అన్నారు. తూప్రాన్ ప్రజలకు నేడు అసలైన దీపావళి పండుగ అని ఇక నుండి తూప్రాన్‌లో ప్రజా పాలన నడుస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు నారాయణ గుప్త, శ్రీశైలం, మామిండ్ల కృష్ణ జ్యోతి, ప్రియాంక రఘుపతి భగవాన్ రెడ్డి, బానపురం రాజు రవీందర్ రెడ్డి జమల్ పుర్ లక్ష్మి బాయి, పల్లెర్ల జ్యోతి రవీంద్ర నాయకులు ఉద్యమ నాయకులు రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి పాక్స్ చైర్మన్ మెట్టు బాలకృష్ణ రెడ్డి తూప్రాన్ మండల సర్పంచుల ఫోరమ్ నగులపల్లి వెంకట్ రెడ్డి అధ్యక్షుడు భగవాన్ రెడ్డి,పార్టీ అధ్యక్షుడు బష్కర్ రెడ్డి నేత మహేందర్ రెడ్డి లింగ రెడ్డి గడ్డి వెంకటేష్ గౌడ్ పాక్స్ డైరెక్టర్ జావేద్ పాషా ధర్మేందర్ శ్రీహరి నారిన్ రెడ్డి బాబులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed