- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందోల్ లో బీఆర్‌ఎస్‌కు ఝలక్..
దిశ, అందోల్ : అందోలు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ, ఆ పార్టీకి ఝలక్ మీద ఝలక్‌లు ఇస్తున్నారు. కొంత కాలంగా అసంతృప్తితో ఉన్న నేతలకు బుజ్జగించే ప్రయత్నాలు చేయకపోగా, వారిని కనీసం పట్టించుకోకపోవడంతోనే వారు అసహనానికి గురై పార్టీని వీడుతున్నట్లు తెలుస్తొంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ బీఆర్‌ఎస్ పార్టీని వీడుతుండడం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయడంతో పాటు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో సహా ఆ పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనే చెప్పవచ్చు. బుధవారం అందోలు – జోగిపేట మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు బీఆర్‌ఎస్ కు రాజీనా చేసి మాజీ డిప్యూటీ సీఎం రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అధికార పార్టీకి చెందిన నాయకులు వరుసగా రాజీనామాలు చేస్తూ, పార్టీ మారుతుండడం పై నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్‌లు బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అందోలు–జోగిపేట మున్సిపాలిటీలోని 12, 14, 20 వార్డులకు చెందిన కౌన్సిలర్లు కోరబోయిన నాగరాజు, పి. దుర్గేష్, చందర్ నాయక్‌లు పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం జోగిపేటలోని క్లాక్‌టవర్ వద్ద ఏర్పాటు చేసిన చేరికల సమావేశానికి సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ హజరయ్యారు. ఆయనకు ఘన స్వాగతం పలికి, గజమాలతో ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్‌లో చేరుతున్న కౌన్సిలర్‌లు నాగరాజ్, దుర్గేష్, చందర్‌నాయక్, మలి దశ ఉద్యమ నాయకుడు అనిల్‌రాజ్, మాజీ కౌన్సిలర్ జోగ్యాల లక్ష్మి లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్, నాయకులు ఎన్.దశరథ్, పిరగారి ప్రభు, 18వ వార్డు పరిధిలోని మైనార్టీ నాయకులు హజ్‌గర్, మత్స్య సహకార సంఘం సభ్యులు జలగిరి యాదగిరితో పాటు ఆయా వార్డుల నుంచి సుమారుగా 800 మందికి పైగా కాంగ్రెస్‌పార్టీలో చేరారు. అదే విధంగా టేక్మాల్ మండలంలోని గొల్లగూడెం, టేక్మాల్, ఎల్లంపల్లి, పాల్వంచ గ్రామాల్లో పర్యటించిన దామోదరకు ఆయా గ్రామాలు ఘన స్వాగతం పలికారు.
ఆయా గ్రామాల్లోని బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కుల సంఘాల నాయకులు, టేక్మాల్ పీఎసీఎస్ మాజీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, పల్వంచ గ్రామ ఉప సర్పంచ్ బేతమ్మ, వార్డు మెంబర్లు బేతయ్య, గంగమ్మతో పాటు మరో ఇద్దరు వార్డు సభ్యులు దామోదర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి దామోదర్ కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్‌ఎస్ పార్టీలో మాకు జరుగుతున్న అవమానాలను భరించలేకనే తాము పార్టీని వీడినట్లు కౌన్సిలర్లు వెల్లడించారు. బీఆర్‌ఎస్ పార్టీని వీడేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని వారంతా త్వరలో కాంగ్రెస్‌లో చేరతారన్నారు. దామోదర హయాంలోనే నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ది చెందిందని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి జరిగేది దామోదర పాలనలోనే వారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌లు ఎస్.సురేందర్‌గౌడ్, రంగ సురేశ్, ఎ.చిట్టిబాబు, హరికృష్ణాగౌడ్, పి.రేఖా ప్రవీణ్, మాజీ కౌన్సిలర్లు ప్రదీప్ గౌడ్, శరత్‌బాబు, మాజీ ఎంపీటీసీ డీజీ వెంకటేశంతో పాటు తదితరులు ఉన్నారు.
పట్టణంలో భారీ ర్యాలీ..
అందోలు – జోగిపేట మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు అధికార పార్టీ కౌన్సిలర్‌లు నాగరాజ్, దుర్గేష్, చందర్, బీజేపీ నాయకుడు కొత్త శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్‌లు బాయికాడి లక్ష్మీ భూమయ్య, లక్ష్మి లక్ష్మినారాయణ, మలి దశ ఉద్యమ నాయకుడు అనిల్‌రాజ్ వారి అనుయాయులతో కలిసి భారీ ర్యాలీని చేపట్టారు. రాజరాజేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించి క్లాక్‌టవర్ మీదుగా అంబేడ్కర్ చౌరస్తా వద్దకు చేరుకుని పూలమాలలు వేశారు. ప్రత్యేకంగా డీజే సౌండ్ పాటలతో, బ్యాండ్ చప్పుళ్లతో జోగినాథ్ చౌరస్తా, గౌని మీదుగా క్లాక్ టవర్ వద్దకు చేరుకున్నారు. ర్యాలీలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం క్లాక్ టవర్‌లోని గాంధీ విగ్రహానికి దామోదరతో కలిసి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.