- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళ రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి
దిశ, సంగారెడ్డి : మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టం చేసినా 2029 వరకు ఇంప్లిమెంటేషన్ కోసం ఆపడం ఎంతవరకు సమంజసం అని, వెంటనే అమలు చేయాలని ఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) సంగారెడ్డి జిల్లా మహిళా సబ్ కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా "దేశాభివృద్ధిలో మహిళల పాత్ర" అనే అంశంపై మహిళ సదస్సు స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టం చేసినా 2029 వరకు ఇంప్లిమెంటేషన్ కోసం ఆపడం ఎంతవరకు సమంజసం అని, ఇప్పుడే ఎందుకు అమలు చేస్తలేరని ప్రశ్నించారు?
వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో, ప్రయాణంలో మహిళా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని, మహిళా ఉద్యోగులకు రెండు సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలని, క్లాస్ కో టీచర్, క్లాస్ ఒక తరగతి గది ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన మండలానికి ఒక పబ్లిక్ స్కూల్ ఏర్పాటులో ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకోవాలని, ఉద్యోగ- ఉపాధ్యాయులకు 30% పీఆర్సీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. డీఈఓ ఎస్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలోని మహిళా ఉపాధ్యాయులు విరామమెరుగక కృషి చేస్తూ పిల్లలకి మంచి విద్యా బుద్ధులు నేర్పిస్తూ మంచి ఫలితాల కోసం ప్రయత్నిస్తున్నారని వారిని అభినందించారు. మహిళలు తమ ఇంటిని చక్కబెట్టుకోవడమే కాకుండా ఈ సమాజాన్ని చక్కబెట్టే ప్రయత్నంలో ముందున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ కవిత కుమారి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి టీ. లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వై.జ్ఞాన మంజరి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సువర్ణ, యం.అమరేశ్వరి, ఎం.శ్యామయ్య, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కె.అశోక్, ప్రధాన కార్యదర్శి బి. సాయిలు, కార్యదర్శులు బి. అరుణశ్రీ, జీజీ.విశాలి, వి.అనురాధ, టీఎస్ యుటిఎఫ్ జిల్లా మహిళా విభాగం కన్వీనర్ లీల కుమారి, నాయకులు జ్యోతి, జోత్స్నా, నాగమణి, విజేత, కౌసల్య, స్వప్న, సుచరిత, సౌభాగ్య, శాంతి బాయి, పార్వతి, నిరూప రాణి సంగారెడ్డి జిల్లాలోని మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.