- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
‘అల్లం’ రైతుకు కాసుల వర్షం.. గతం కంటే ఎనిమిది రెట్లు పెరుగుదల
దిశ, ఝరాసంగం: భూతల్లి దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను ఎప్పుడు దుఃఖం పాలు చేయడమేనా అనుకున్నదేమో కానీ అల్లం రైతులకు ఈసారి కాసుల వర్షం కురిపించి అన్నదాతలను ఆశీర్వదించింది. ఏకంగా గతం కంటే అల్లం ధర ఎనిమిది రెట్లు ఎక్కువ ధర పలుకుతోంది. రెండు, మూడు సంవత్సరాలతో పోలిస్తే అల్లం ధర ఒక్కసారిగా ఎనిమిది రెట్లు పెరిగింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో ఝరాసంగం, కోహిర్, న్యాల్ కాల్, మొగుడంపల్లి, జహీరాబాద్ మండలాల పరిధిలోని రైతులు సంవత్సరం అల్లం పంటను సంప్రదాయక పంటగా సాగు చేస్తూ వస్తున్నారు.
జిల్లాలో రెండు, మూడు సంవత్సరాలతో పోలిస్తే అల్లం ధర ఒక్కసారిగా ఎనిమిది రెట్లు పెరిగింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో ఝరాసంగం, కోహిర్, న్యాల్ కాల్, మొగుడంపల్లి, జహీరాబాద్ మండలాల పరిధిలోని రైతులు సంవత్సరం అల్లం పంటను సంప్రదాయక పంటగా సాగు చేస్తూ వస్తున్నారు. ఐదేళ్లుగా క్వింటాలు అల్లం ధర రూ.1500 నుంచి రూ. రెండు వేల వరకు మాత్రమే పలుకుతూ వచ్చింది. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో రూ.14 వేలకు పైగా ధర పలుకుతోంది. దీంతో పంటను సాగు చేస్తున్న రైతులు ఆనందంగా ఉన్నారు. ఐదేళ్లుగా మార్కెట్‌లో అల్లం పంటకు సరైన ధర లేక పోవడంతో దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం భారీగా పడిపోయింది.
గత సంవత్సరం అధికంగా వర్షాలు పడటంతో సాగులో ఉన్న పంట సగానికి పైగా దెబ్బతిన్నని రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్నిసార్లు రైతులు ధర లేకపోవడంతో భూమిలోనే వదిలేసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం పంటను కాపాడుకున్న రైతులకు కాసుల వర్షం కురుస్తోంది. అనేక మంది రైతులు గత ఏడాది క్రితమే ధర లేని కారణంగా అల్లం సాగుకు చేయడం మానేశారు. సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 2,000 ఎకరాల్లో పంట సాగులో ఉన్నట్టు సమాచారం. ఇందులో జహీరాబాద్ ప్రాంతంలోనే 85శాతం జహీరాబాద్ ప్రాంతంలో అల్లం సాగు చేస్తున్నట్లు సమాచారం ఉంది.
అల్లం సాగుపై రైతుల ఆసక్తి
గత ఐదేళ్లుగా అల్లం పంటకు నష్టాలు రావడంతో కొంతమంది రైతులు సాగు చేయడం మానేశారు. ఈ సంవత్సరం మంచి ధర రావడంతో రైతులు అల్లం వేసేందుకు ముందుకు వస్తున్నారు. ఎకరాకు సుమారుగా రూ. 1.20 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. ధర ఉంటేనే లాభ ఉంటుంది లేదంటే పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సంవత్సరం సంగారెడ్డి జిల్లాలో నాలుగువేల ఎకరాల వరకు పంట సాగు చేసే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. సామాన్యునికి భారంగా అల్లం ధర అల్లం ధర పెరిగిందని రైతులు ఆనందంగా ఉన్న కొనుగోలుదారులకు కొంత నష్టం కలుగుతుంది. అల్లం.. పేదోడి నుంచి కోటిశ్వరుడి వరకు ప్రతిరోజు కూరల్లో వాడే సుగంధ ద్రవ్యం. అల్లం ధర పెరిగిందని రైతు ఆనందంగా ఉన్న సామాన్యుడికి కొంత భారంగా తయారయింది. రైతు నుంచి కొనుగోలు చేసిన వ్యాపారులు ఒకటికి నాలుగు రేట్లు పెంచి అమ్మడంతో అల్లం రేట్లు పుండెక్కాయి.