చెరువును తలపిస్తున్న చేర్యాల ప్రధాన రహదారి

by Aamani |
చెరువును తలపిస్తున్న చేర్యాల ప్రధాన రహదారి
X

దిశ, చేర్యాల: చేర్యాల పట్టణ కేంద్రంలోని ప్రధాన జాతీయ రహదారి చెరువుని తలపిస్తుంది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి పై భాగంలో ఉన్న కట్టలు తెగడంతో శనివారం మధ్యాహ్నం చెరువులోకి చేరవలసిన వర్షపు నీరు ప్రధాన రహదారి పై ప్రవహిస్తుంది. చెరువులోకి నీరు వెళ్ళే నాళాలు మూసి వాటిపైన అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో ఆ నీరు కాస్త ప్రధాన రహదారి పైకి చేరి వ్యాపార సముదాయాల ముందు ప్రవహించడంతో అటు ప్రజలు, ఇటు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed