పేద ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్రం : ఎమ్మెల్యే జిఎంఆర్

by Sridhar Babu |
పేద ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్రం : ఎమ్మెల్యే జిఎంఆర్
X

దిశ, పటాన్ చెరు : గ్యాస్ ధరలు పెంచుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తుంరని పటాన్ చెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి విమర్శించారు. పెంచిన వంట గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ పిలుపుమేరకు పటాన్​చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక జాతీయ రహదారిపై భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి, వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు 150 శాతం గ్యాస్ ధరలను పెంచారన్నారు.

కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తూ పేదల పాలిట పెనుభూతంగా మారిందని దుయ్యబట్టారు. చమురు ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మూలంగా ప్రజలు చివరకు మళ్లీ కట్టెల పొయ్యి పై వంటలు చేసుకునే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు. సామాన్యుడు బతకలేని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రధాని మోడీని గద్దె దించే వరకు పోరాటం సాగుతూనే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story