- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG News : పోలీసుల అదుపులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

దిశ, వెబ్ డెస్క్ : నారాయణఖేడ్(Narayanakhed) బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి(BRS Former MLA Bhupal Reddy)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ ప్రభుత్వ హయాంలో టెండర్లు పూర్తయిన రోడ్లు నిర్మించాలని పలు గ్రామాల ప్రజలతో కలిసి రాష్ట్ర రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, గ్రామస్తులు పాల్గొనడంతో పెద్ద ఎత్తున వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని సర్దిచెప్పినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేదేం లేక మంగలపేట వద్ద భూపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకొని, నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ కు ఆయనను తరలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు రోడ్లకు టెండర్లు పిలిచి, అన్ని అనుమతులు మంజూరు చేశామని.. కాగా కాంగ్రెస్ నేతలు కొంతమంది రోడ్ల నిర్మాణం జరగకుండా అడ్డుకుంటున్నారని, అభివృద్ది కంఠకుల పార్టీ కాంగ్రెస్ అని ఆయన మండిపడ్డారు. రెండేళ్ల నుండి గ్రామాలకు రహదారుల నిర్మాణం కోసం ఆయా గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఏదో కారణంతో వాటిని ఆపడం ఏంటని ప్రశ్నించారు.