- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఐ గొప్పమనసు.. సమయానికి టెన్త్ విద్యార్థిని పరీక్షా సెంటర్‌కు చేర్చారు
దిశ, మక్తల్: పదో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థిని ఒక సెంటర్ బదులు మరో సెంటర్‌కు రావడంతో ఆందోళనకు గురైంది. విద్యార్థిని గాబరా పడుతున్న విషయాన్ని గుర్తించిన సీఐ సీతయ్య వెంటనే స్పందించి విషయం తెలుసుకున్నారు. వెంటనే స్పందించి ఆ విద్యార్థినిని ద్విచక్రవాహనంపై తన సిబ్బందితో సకాలంలో సెంటర్‌కు చేర్చి మానవత దృక్పథాన్ని చాటుకున్నారు. దీంతో సదరు విద్యార్థిని పరీక్ష సెంటర్ కు సకాలంలో చేరుకుని ఎగ్జామ్ రాసింది.
వివరాల్లోకి వెళ్తే భవాని అనే విద్యార్థిని పదో తరగతి సప్లి మెంటరీ పరీక్ష రాయడానికి నారాయణ పేట లోని బాలికల ఉన్నత పాఠశాల కేటాయించారు. అయితే భవాని మక్తల్ బాలికల ఉన్నత పాఠశాల అనుకుని అక్కడకు 8.45కు చేరుకుంది. అక్కడి సిబ్బంది హాల్ టికెట్ చెక్ చేసి సెంటర్ నారాయణపేటగా గుర్తించారు. దీంతో విద్యార్థి కంట తడి పెట్టడంతో వెంటనే సీఐ సీతయ్య విషయం గమనించి వేంటనే స్పందించి వెంటనే కానిస్టేబుల్ అశోక్‌ను టూవీలర్ పై 30 కిలో మీటర్ల దూరంలోని నారాయణ పేట సెంటర్ వద్ద విద్యార్థినిని దింపి రావాలని పంపారు. విద్యార్థిని సకాలంలో సెంటర్‌కు చేరుకుని పరీక్ష రాయడంతో స్థానికులు సీఐ సీతయ్య తోపాటు కానిస్టేబుల్ అశోక్ ను అభినందించారు. మరోసారి సకాలంలో స్పందించి, సేవా గుణం చాటుకున్న సీఐ సీతయ్యను స్థానికులు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.