- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాటాచ్చినం... నిలబెట్టుకుంటున్నం…
దిశ, అందోల్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి పరిపాలనను సాగిస్తుందని, నేరవేర్చగలిగే హామీలనే కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ. దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఎన్నికలకు ముందు 100 రోజుల్లో ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని మాటిచ్చి...ఆ మాటాను నిలబెట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య బీమాకు రూ.10 లక్షలు పెంపు, 200 యూనిట్‌ల ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సీలిండర్ పథకాలను అమలు చేస్తున్నామని, ఈ నెల 11న ఇందిరమ్మ పేరిట ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు, స్థలాలు లేని వారికి 100 గజాల స్థలం పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
గురువారం అందోలు–జోగిపేట మున్సిపాలిటీలో రూ. 138.11కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా పాలిటేక్నిక్, కేజీబీవీ, గురుకుల పాఠశాలలు, డిగ్రీ, జూనియర్ కళాశాల విద్యార్థినీలతో మాట్లాడారు. బాలికలు ఉన్నతమైన చదువులతోనే రాష్ట్రాభివృద్ధి, కుటుంబ ఆరోగ్యం ఉంటుందన్నారు. అనంతరం జీరో యూనిట్‌కు సంబంధించిన బిల్లులను లబ్దిదారులకు అందజేసి, తన ప్రసంగాన్ని కొనసాగించారు. 200 యూనిట్‌ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా మేలు జరుగనుందన్నారు. అందోలు నియోజకవర్గానికి మా కుటుంబానికి ఎనలేని అనుబంధం ఉందని, నా కన్నతల్లి లాంటి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. జోగిపేట పట్టణానికి వ్యాపార పరంగా పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు జోగిపేట నుంచి అజ్జమర్రి వరకు రోడ్డును, వంతేనను మంజూరు చేయించానన్నారు.
సింగూరు జలాలను వైఎస్‌ఆర్ హాయాంలో రూ.90 కోట్లను మంజూరు చేయించి, చెరువులను నింపి 40 వేల ఎకరాలకు నీటిని అందించానన్నారు. జేఎన్‌టీయూ, వ్యవసాయ, సాంకేతిక పాలిటేక్నిక్, డిగ్రీ, పీజీ కళాశాలలను తీసుకొచ్చానన్నారు. ఏ నాయకుడికైనా ప్రాంతం పై అభిమానం ఉండాలని, అభివృద్ధి చేయాలన్న తపన ఉండాలన్నారు. జోగిపేటకు నర్సింగ్ కళాశాల, హస్టల్, 150 పడకల అసుపత్రిని మంజూరు చేయిస్తానన్నారు. వట్‌పల్లికి రూ.11.20 కోట్లతో 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.
ఐదేళ్ల కాలంలో నియోజకవర్గ రూపురేఖలను మార్చుకుందామన్నారు. జోగిపేటలో పీఆర్‌టీయూ సంఘం భవనాన్ని 300 నుంచి 500 గజాల స్థలంలో నిర్మించి ఇస్తామని ఆయన హామీనిచ్చారు. అందోలు చెరువు కట్టను సుందరీకరణగా మారుస్తానన్నారు. సింగూర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీనిచ్చారు.
తొమ్మిదేళ్లుగా దోపిడీకి గురైన రాష్ట్రం:
బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా దోపీడీకి గురైందని, కాళేశ్వరం పేరిట రూ.లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. కాంగ్రెస్ హాయాంలో నిర్మించిన ఏ ఒక్క ప్రాజెక్టుపై అవినీతి మచ్చ రాలేదన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను రూ. 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో స్వేచ్చ నిర్భంధమైందని, కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఉండవని తప్పు చేసిన వారిని ప్రశ్నించాలన్నారు. ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరిస్తున్నామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. పాలకుల్లో జవాబుదారితనం ఉండాలని, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు సహకారం, కృషి ఎప్పుడు ఉంటుందన్నారు.
రూ.138.11 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
అల్మాయిపేట శివారులో 33/11 కేవి విద్యూత్ సబ్‌స్టేషన్, జోగిపేట నుంచి అజ్జమర్రి వరకు రూ. 80 కోట్లతో రోడ్డు, వంతేన, సంగుపేట జంక్షన్ నుంచి అన్నాసాగర్ వరకు రూ.20 కోట్లతో రోడ్డు వెడల్పు, బట్టర్ ఫ్లై లైట్లు, రూ.1.46 కోట్లతో మహిళా వ్యవసాయ, పాలిటేక్నిక్ కళాశాల ప్రహారీల ఏర్పాటు, కేజీబీవీలోని పెండింగ్ పనులకు రూ.1.24 కోట్లు, ఎన్‌టీఆర్ స్టేడియం, ఇండోర్ స్టేడియం, కంపౌండ్ వాల్‌కు రూ. 2 కోట్లు, మున్సిపల్ నూతన భవనానికి రూ.6 కోట్లు, జోగిపేటలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల ప్రహారీ గోడల నిర్మాణానికి రూ.1.76 కోట్ల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
అదే విధంగా జోగిపేటలో పీఆర్‌టీయూ సంఘ భవనానికి 300 నుంచి 500 గజాల స్థలంతో పాటు భవనాన్ని నిర్మించి ఇస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, మాజీ ఎంపీ సురేష్ షేట్కార్, ఆర్‌అండ్‌బీ ఈఈ రాంబాబు, ఈపీహెచ్ వీరప్రతాప్, డీసీహెచ్‌ఓ సంగారెడ్డి, ఆర్‌డీవో పాండు, టీఎస్‌ఈడబ్ల్యూ ఐడీసీ డిప్యూటీ ఈఈ రాంకుమార్, కమిషనర్ తిరుపతి, చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ డేవిడ్, కౌన్సిలర్‌లు ఎస్. సురేందర్‌గౌడ్, రంగ సురేష్, ఆకుల చిట్టిబాబు, డాకూరి శంకర్, పి.రేఖ ప్రవీణ్, హరికృష్ణాగౌడ్, నాగరాజ్, దుర్గేష్, చందర్, ఆర్.భవానీ నాగరత్నంగౌడ్, ఉల్వల మాధవి వెంకటేశం, పీసీసీ సభ్యుడు మున్నూరు కిషన్, జడ్పీ కొ అప్షన్ సభ్యుడు యూసుఫ్, నాయకులు శివకుమార్, రాములు, శ్రీనివాస్‌గౌడ్, రవి, శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.