- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
దిశ, సంగారెడ్డి : ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఆర్ఓ, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. మంగళవారం రుద్రారం గీతం యూనివర్సిటీ కళాశాలలో, స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరిచిన నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్, ఎల్లారెడ్డి , కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ అసెంబ్లీ సెగ్మెంట్ లకు సంబంధించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పోలీస్ భద్రతను, సీసీ కెమెరాల పనితీరును, కంట్రోల్ రూమ్ రికార్డులను, పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉండాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిమ్జ్ ప్రత్యేకాధికారి రవీందర్ రెడ్డి, సర్వేయర్ కోటేశ్వరావు, ఏఆర్ఓ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.