ఎస్సీ వర్గీకరణ చేస్తే దళిత జాతికి న్యాయం

by Sridhar Babu |
ఎస్సీ వర్గీకరణ చేస్తే దళిత జాతికి న్యాయం
X

దిశ,పటాన్ చెరు : ఎస్సీ వర్గీకరణ చేస్తే దళిత జాతికి న్యాయం జరుగుతుందని, ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో అమలు చేయాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాదులో రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్ లతో పాటు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు

వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు,మాజీ ఎంపీ పసునూరి దయాకర్ తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వర్గీకరణ అంశం అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో వర్గీకరణ విధానాన్ని అమలు చేస్తే దళిత జాతికి పూర్తి న్యాయం చేసినట్లు అవుతుందని తెలిపారు.

Advertisement

Next Story