గొప్ప స్ఫూర్తి ప్రదాత సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్:ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

by Kalyani |
గొప్ప స్ఫూర్తి ప్రదాత సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్:ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
X

దిశ, పటాన్ చెరు: గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గొప్ప స్ఫూర్తి ప్రదాత అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతిని పురస్కరించుకొని తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని విద్యుత్ నగర్ కాలనీ సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూ. 57 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన బంజారా భవన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో గిరిజనులు ఆర్థికంగా, సామాజికంగా అభ్యున్నతి సాధిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.

సేవాలాల్ ఆశయాల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనుల చిరకాల వాంఛను నెరవేర్చి, పరిపాలనలో వారిని భాగస్వాములనుచేసిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, సీనియర్ నాయకులు సోమిరెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story