- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Sanitation : ముప్పారం తండాలో పారిశుధ్యం అస్తవ్యస్తం ..
దిశ, అల్లాదుర్గం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్చదనం - పచ్చదనం అనే కార్యక్రమాన్ని ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు 5 రోజుల పాటు ప్రతి గ్రామపంచాయతీలో నిర్వహించాలని అధికారులకు ఆదేశించింది. ఈ క్రమంలోనే మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో ఈ కార్యక్రమం కేవలం అధికారుల ఫోటోలకు మాత్రమే పరిమితమయ్యాయి. గ్రామాల్లో పరిసరాలను శుభ్రంగా ఉంచి, చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని తద్వారా రోగాలను నివారించవచ్చని ప్రభుత్వం చెబుతోంది. కానీ కింది స్థాయి అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని తండావాసులు ఆరోపిస్తున్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని ముప్పారం తండాలో రోడ్డు పై వర్షపు నీరు నిల్వ ఉండడం చేత దోమలు, ఈగలు, వాలి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తూ, దుర్వాసనను వెదజల్లుతుంది.
ప్రతిరోజు తడి, పొడి, చెత్తను వేరు చేసి సేకరించాల్సి ఉండగా, రెండు నెలలకు పైగా జీపీ ట్రాక్టర్ తిరగకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడ దర్శనమిస్తూ, ప్రజలను రోగాల బారిన వేటాడుతుంది. స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమం ముప్పారం తండాలో చేపట్టాల్సిన పారిశుద్ధ్యం పనులు పడకేస్తున్నాయని తండావాసులు ఆరోపించారు. రోడ్డు మీద ఉన్న బురదను, శుభ్రం చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమాలు పేరుకేలే ..?! అంటూ తండావాసులు చెప్పుకుంటున్నారు. రోడ్డుపై నిల్వ ఉన్న నీటిని, బురదను తీసి ఆ నీటిని పక్కకు మళ్లించాలని తండావాసులు కోరుతున్నారు. ఇంత జరుగుతున్న మండల అధికారులు పర్యవేక్షించడం లేదని వారన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తండాలలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
గిరిజన తండాల్లో అధికారుల పర్యవేక్షణ కరువు...
మండలంలోని పలుగిరిజన తండాల్లో నెలకొన్న సమస్యల పై మండల స్థాయి అధికారులు పర్యవేక్షణలో వుంటూ వాటి పరిష్కార మార్గంకు కృషి చేయాల్సి వుంటుంది. కానీ అల్లాదుర్గం మండలంలో అధికారుల పర్యవేక్షణ కొరవడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదనే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమస్యలను పరిష్కరించాలి..
తండాలో నెలకొన్న నీటి సమస్య, పారిశుధ్యం, తదితర సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించకుండా మండల స్థాయి అధికారులు వెంటనే పరిష్కరించాలని ముప్పారం తండా వాసులు కోరుతున్నారు.