Prashanth kishore: ప్రశాంత్ కిషోర్‌కు షాక్.. బైపోల్స్‌లో ఏ మాత్రం ప్రభావం చూపని జన్ సూరజ్

by vinod kumar |
Prashanth kishore: ప్రశాంత్ కిషోర్‌కు షాక్.. బైపోల్స్‌లో ఏ మాత్రం ప్రభావం చూపని జన్ సూరజ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ (Prashanth Kishore) అక్టోబర్ 2న జన్ సూరజ్ (Jan suraj) పేరుతో రాజకీయ పార్టీ (Political party)ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే పార్టీ మొదటి సారిగా బిహార్ ఉపఎన్నికల్లో పోటీ చేసి దారుణంగా విఫలమైంది. రాష్ట్రంలోని 4 అసెంబ్లీ స్థానాలకు జరిగిన బైపోల్స్‌లో జన్ సూరజ్ పార్టీ అభ్యర్థులంతా ఓటమి పాలయ్యారు. ఆయన పార్టీ మూడు స్థానాల్లో మూడో స్థానంలో, ఒక స్థానంలో నాలుగో స్థానంలో నిలిచింది. జన్ సూరజ్ అభ్యర్థులకు బెలగంజ్‌(Brlaganj) లో 17,285 ఓట్లు, రామ్‌గఢ్‌(Ramghad)లో 6,513, తరారీ(Thraree)లో 5,592, ఇమామ్‌గంజ్‌(Imamganj)లో 37,103 ఓట్లు వచ్చాయి. ఈ నాలుగు స్థానాల్లోనూ ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో ప్రశాంత్ కిషోర్ కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది.

కాగా, గత పదేళ్లలో అనేక పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే బిహార్‌లో సుదీర్ఘ పాదయాత్ర తర్వాత పార్టీని స్థాపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు హామీలు సైతం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జన్ సూరజ్ తదుపరి ప్రభుత్వాన్ని చూడాలనుకుంటే, ప్రస్తుతం జరగనున్న బైపోల్స్‌లోని నాలుగు స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రజలు మాత్రం ఆయనకు భారీ షాక్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ప్రశాంత్‌కు అవకాశం ఇచ్చే ఆలోచనలో బిహార్ ప్రజలు లేరని పలువురు భావిస్తున్నారు. ఈ ఘోర పరాజయం తర్వాత బిహార్‌లో ప్రశాంత్ కిషోర్ తదుపరి రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed