- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూసి బాధితులతో రాజకీయాలు వద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్..
దిశ సిద్దిపేట ప్రతినిధి : మూసి బాధితుల పట్ల ప్రతిపక్షాలు, హరీష్ రావు లాంటి నాయకులు రాజకీయం చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో పదవి విరమణ పంక్షన్ కి హాజరైన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దని సూచించారు. హైదారాబాద్ తెలంగాణకి గుండె కాయ.. హైదరాబాద్ లో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలే కృష్ణ, గోదావరి జలాలు ద్వారా హైదారాబాద్ ప్రజలకి తాగునీరు అందించినట్లు తెలిపారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వర్షాలు వస్తే హైదారాబాద్ లో నాళాలు మునిగి ప్రజలు అష్టకష్టాలు పడినట్లు గుర్తు చేశారు. హైదారాబాద్ లోని మూసీ, లేక్ సిటీ డెవలప్ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మూసి కాల్వ ఇరు వైపులా నివాసం ఉన్న వారిని బలవంతంగా ఖాళీ చేపిస్తలేము, అలా ప్రచారం చేయడం సరికాదు అన్నారు. మూసి బాధితులకు ప్రత్యమ్నాయంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తాం, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ఇచ్చి ఆదుకుంటాం అన్నారు. మూసీని మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం అన్నారు.
గత ప్రభుత్వంలో మేము ప్రతి పక్షంలో ఉన్నపుడు సమస్యల పై మాకు నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో నిర్వాసితులను లాఠీలతో అణిచి వేశారు. మేము బాధితులను సమన్వయ పరుస్తున్నట్లు తెలిపారు. అధికారం లేదని బీఆర్ఎస్ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నట్లు మండిపడ్డారు. మూసి నిర్వాసిత కుటుంబాల జీవితాలతో ప్రతిపక్షాలు ఆడుకోవద్దన్నారు. యావత్ రాష్ట్రంలో హైడ్రాను సాగదీస్తున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో అన్ని చెరువులను రక్షిస్తామన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూజల హరికృష్ణ, టీపీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం, నాయకులు బొమ్మల యాదగిరి, సాకీ ఆనంద్, అలాకుంట మహేందర్ తదితరులు పాల్గొన్నారు.