- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
దిశ, అల్లాదుర్గం: చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందిన ఘటన అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన కొన్యాల వేణు అలియాస్ రవి (26) లేబర్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజూ మద్యం సేవించి తల్లి సత్తెమ్మతో తరచూ గొడవ పడేవాడు. ఈనెల 1న పనికి వెళ్లిన రవి తిరిగి సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే బాగా మద్యం సేవించి ఉన్న రవి తల్లితో వాగ్వాదానికి దిగాడు.
ఆవేశంలో ఇంట్లో ఉన్న టర్పంటాయిల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. చుట్టుపక్కల వారు అప్రమత్తమై మంటలను ఆర్పారు. అనంతం అతడిని జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి గాంధీకి ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో రవి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. తల్లి సత్తెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అల్లాదుర్గం ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు.